Breaking News

పెరేడ్ గ్రౌండ్ లో ఆకట్టుకున్న వివిధ శాఖల స్టాళ్ల ప్రదర్శన !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
76 వ స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌ గ్రౌండ్‌ లో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన స్టాళ్ల ప్రదర్శన పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక , యువజన సంక్షేమ శాఖామాత్యులు, కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్. కె. రోజా, జడ్పి ఛైర్ పర్సన్ ఉప్పాల హారికా, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, జిల్లా ఎస్పీ పి. జాషువా తదితరులు హాజరయ్యారు.
జిల్లా పశుసంవర్ధక శాఖ స్టాల్ లో దేశవాళీ ఆవుల సంరక్షణ విధానాలు, పుంగనూరు పొట్టి గిత్తలు, పొట్టేళ్లు, బాతులు, కోళ్లు, మేకలను ప్రదర్శించారు. అలాగే వివిధ రకాల మేలైన పశుగ్రాసం, నియోజకవర్గ స్థాయి పశువ్యాధి నిర్దారణప్రయోగశాల పని తీరు గూర్చి తమ స్టాల్ వద్ద వివరించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు పేదరికం నుండి బయటపడటానికి, జీవనోపాదులు పెంపొందించుటకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను గూర్చి గ్రామీణాభివృద్ధి సంస్థ ( డి ఆర్ డి ఏ ) స్టాల్ లో ప్రదర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ), పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నారని , వీటితో పాటు అదనంగా వ్యాపారాలు చేసుకునే మహిళలకు స్త్రీ నిధి ద్వారా ప్రత్యేకంగా రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. సంఘాలను బలోపేతం చేసేలా డీఆర్‌డీఏ, వైఎస్సార్‌ క్రాంతి పథం అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు వివిధ జబ్బులను ఎదుర్కోనేందుకు ప్రతిరోజు పండ్లు, కూరగాయలు తీసుకోవాలని చిన్నారులు బాలామృతంతో పలు రకాల పోషక విలువలు ఏ విధంగా లభిస్తాయో వివరిస్తూ చార్టు సహాయంతో అంగన్వాడీ ఉపాధ్యాయురాలు పలువురికి వివరించారు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదల కోసం ఎక్కువ పోషక విలువలు గల ఆహారం తీసుకునేలా అవగాహన కల్పించేలా చిరుధాన్యాల పోషకాలు వాటితో తయారుచేసిన ఆహారపదార్థాలు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పోషకాహారంపై మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ , రురల్ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటుచేశారు. అలాగే , సందర్శకులకు వ్యవసాయ శాఖ,వ్యవసాయం ఉత్తమ పధ్ధతులు గూర్చి వివరించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఉద్యానవ పంటలు, అధిక దిగుబడి కోసం పండ్లు, కూరగాయలు, పూల సాగు ఎలా చేయాలని తెలిపారు. ఎరువుల వాడకంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు, కంపోస్టు ఎందుకు చేయాలి దాని వల్ల కలిగే లాభాలు ,గ్రామీణ,పట్టణ సేంద్రియ వ్యర్ధాలు కల్తీ ఎరువులను గుర్తించడానికి కొన్ని చిట్కాలను తెలియచేస్తూ, కీటక నివారిణి రకాల గూర్చి ఆసక్తితో అడిగినవారికి ఎంతో విలువైన సమాచారం అందించారు. అలాగే జిల్లా మత్స్య శాఖ, సూక్ష్మ సేద్య పథకాలు, ఉద్యానవన శాఖ, గృహ నిర్మాణ శాఖ, ఎస్సి , బీ సి కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఎగ్జిబిషన్ లో జాతీయోద్యమ కాలం నాటి జ్ఞాపకాలు, దేశభక్తులు, మహనీయుల ఫోటోలను పలువురు సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ( మెప్మా ) , గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఏర్పాటుచేసిన స్టాల్ లో నీటి నాణ్యత విశ్లేషణ, హెచ్ డి పి ఇ పైపుల మన్నిక, పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఆర్ డబ్ల్యూఎస్ పనితీరు వివరించారు. జిల్లా అటవీశాఖ, ఏ పి వైద్య ఆరోగ్య శాఖ, క్షయవ్యాధి నిర్ధారణ శాఖ తదితర శాఖలకు సంబంధించి చేపడుతు న్న సంక్షేమ పథకాలపై అధికారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. స్టాళ్లను సందర్శించి, వాటి వివరాలు అడిగి తెలుసుకొని నిర్వాహకులను అభినందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ నెల 12 న ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా పర్యటన

-పర్యటన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల జనవరి 12న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *