ఉద్యోగులకు పూర్తి స్థాయిలో నగదు రహిత చికిత్సలు అందించాలి…

-వినుకొండ రాజారావు విజ్ఞప్తి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నిర్ణయించిన లక్ష్యాలు సాధించడానికి ప్రభుత్వ ఉద్యోగి వారధిగా ప్రజలకు సేవలు చేస్తుంటారని, ఉద్యోగి కూడా ప్రజల్లో భాగమనని అయితే రాష్ట్రస్థాయిలో ఉద్యోగ లోకానికి వచ్చే సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘం ముందు ఉంటుందనిమా సంఘం లో ఆఫీస్ సబార్డినేట్ నుండి అధికారి వరకు అందరూ సభ్యులుగా ఉంటారని సంఘం ఏర్పాటు చేసిన కొన్ని నెలల్లోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 11వ పిఆర్.సి లో మా సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక విధానం ద్వారా ప్రభుత్వంతో చర్చలకు వెళ్లి ఉద్యోగుల పక్షం వహించి అనతికాలంలోనే రాష్ట్ర ఉద్యోగుల మన్ననలు పొందామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సంఘనాయకత్వాలను పటిష్టం చేస్తున్నామని దానిలో భాగంగా ప్రకాశం జిల్లాఒంగోలు సంఘ కార్యాలయంలో సంఘ ముఖ్య నాయకుల సమావేశంలో వినుకొండ రాజారావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావలసిన, డిఎలు ఎప్పటికప్పుడు మంజూరు చేయాలని, జిపిఎఫ్ కోసం ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని, అలాగే ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగి జీతంలో వాటా కటింగ్ చేస్తుంటారని ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ద్వారా నగదు రహిత చికిత్స అందించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కానీ పూర్తిస్థాయిలో ఇహెచ్ యస్ కార్డు వినియోగంలోకి రాలేదని, పూర్తిస్థాయిలో వినియోగం లోకి తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని, ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇహెచ్ యస్ పరిధిలోనికికొత్తగా ఆర్టీసీ ఉద్యోగులు, మరియు గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు కూడా ఈహెచ్ఎస్ పరిధిలోకి వచ్చారని, కార్డు తీసుకొని వైద్యానికి వెళితే నగదురహిత చికిత్ససేవలు మరియు మెరుగైన వైద్య చికిత్సలు ఉద్యోగికి వారి కుటుంబ సభ్యులకి అందే విధంగాచర్యలుతీసుకోవాలని,అలాగే ఉద్యోగికి, వారికుటుంబ సభ్యులు కు ఆరోగ్య భద్రత కల్పించాలని, గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులకు వెంటనే ఇహెచ్ఎస్ కార్డు అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో నూతనంగా పదవీబాధ్యతలను స్వీకరించిన ప్రకాశం జిల్లా అసోషియేట్ ప్రసిడెంట్ పయ్యావుల శ్రీనివాసరావుని మరియు సూపర్ వైజర్ గా పదోన్నతి పొంది గుంటూరు కు వెళుతున్న తెలగలపూడి మాణిక్యమ్మ ను సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమము రాష్ట్ర ఉపాధ్యక్షురాలు యం.డి హజీరాబేగం అధ్యక్షతన జరిగింది, జిల్లా అధ్యక్షులు టి విజయ్ కుమార్ జి.ఆశాజ్యోతి, డి.రసూల్, మాకినేని మురళీ, బి,పాన్యం మస్తాన్ బి,గుంటూరి కృపావతి, యం.వెంకటేశ్వర నాయక్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉలి చెక్కిన కల

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర చెక్క కళాకారుల వారసత్వం చెక్క మలిచే కళాకారుల పరస్పర సహకార సంస్థ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *