-విష్ణుభట్ల శివప్రసాద్
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ వైదిక కమిటీ, ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివ ప్రసాద్ శర్మ ఆలయ మీడియా వేదికనుండి ఇరుముడుల విరమణ, హోమగుండం విషయాలపై మాట్లాడుతూ కాలచక్రంలో వసంత ఋతువుకు, శరత్ ఋతువుకు మధ్య విషఘడియలు గల ఋతువులుగా చెప్పబడినవన్నారు. ఆ విషఘడియల ప్రభావం భూమి మీద లేకుండా కాపాడే శక్తిఅయిన దుర్గమ్మను దర్శిస్తే దుర్గతులు నశిస్తాయని, అదే విధంగా వసంత ఋతువులో వసంత నవరాత్రులు, శరత్ ఋతువులో శరన్నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆవిధంలోనే శక్తి పూజలు ప్రధానంగా చేయడం జరుగుతుందన్నారు. ఇలా నవరాత్రుల అనంతరం దశమి రోజున ఆయుధ పూజలు చేయడం జారుతుందన్నారు. ఆశ్రమంలోనే చివరి రెండు రోజులు భక్తులు అధికంగా రావడం, చివరి రెండు రోజుల్లో భవానీ మాలవేసుకున్న మాలధారులు ప్రత్యేక ఇరుముడిగుండములు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నారు. అయితే మాలధారులు దీక్ష చేయుటకు కంచి పరమాచార్యుల వారు నిర్ణయించిన ప్రకారం మాలధారణ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలన్నది ఒక ప్రామాణికత ఉండడంతో శరత్ ఋతువులో శక్తి రూపమైన అమ్మవారిని నవరాత్రులూ పూజించడం జరుగుతున్నదన్నారు. ఈపద్ధతిని సుమారు 41 సంవత్సరముల క్రితం 1981వ సంవత్సరం నుండి శ్రీముఖంగా తీసుకురావడం, 1982 నుండి 9 మందితో మొదలైన మాలధారణలు ప్రస్తుతం 9 లక్షల మందివరకూ మాలధారణలు ఈ కార్తీక మాసంలో చేయడం జరుగుతున్నదన్నారు. శరన్నవరాత్రులు కదా మాలధారణ వేస్తే బాగుంటుంది అని మాలధారణ చేయడం జరుగుతోందన్నారు. ఇందుకు ఎవరి అభ్యంతరం ఉండదు. మాలధారణ చక్కగా చేసుకోవచ్చునని చెప్పారు. శాస్త్ర ప్రకారం దేవీ భాగవత పురాణం, శాంతి కమలాకారం వంటి ఆగమపరమైన విశేష గ్రంధాలలో వివరించిన ప్రకారం శక్తి రూపమైన అమ్మవారిని ఆరాధించడం జరుగుతోందన్నారు. అందువల్ల ఇరుముడిగుండం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టడానికి వీలు లేనందున కార్తీక పౌర్ణమితో మొదలుపెట్టి 40 రోజులు ఆచరిస్తామన్నారు. ఆ 40 రోజుల్లో చివరి 5 రోజుల్లో శతచండీ హోమం నిర్వహించి ఇరుముడిగుండం ప్రారంభం చేస్తామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో దీక్షలు తీసుకున్నప్పుడు మార్గసిరశుద్ధ షష్టి నుంచి దశమి వరకు మార్గసిరబహుళ సప్తమి, అష్టమి, నవమి, దశమి ఇలాగ 5 రోజులు పాటు భవాని దీక్ష హోమగుండం పెట్టి ఇరుముడులు సమర్పించడం జారుతుగుతోంది. కావున భవాని మాలధారులు అందరూ కూడా సహకరించి సామాన్య భక్తులకు కూడా దర్శనం చేసుకోవడానికి సహకరించి కార్తీక మాసంలో ఇరుముడి దీక్షలు తీసుకున్నప్పుడు సంకల్పంలో భవానీ దీక్ష సంకల్ప సిద్ధిరస్తు మంత్ర ఆవాహన జరుగుతుంది కావున ఆసమయంలో మాత్రమే పాటిస్తే బాగుంటుందని కోరుతున్నామన్నారు. నవరాత్రుల్లో భవాని మాలధారణకు ప్రత్యేక సంకల్పం చెప్పబడి ఉండనందున నవరాతుల్లో తీసుకున్న దీక్షలకు దీక్షాదారులు వారి వారి ప్రాంతాలలో గురుభవానీలను సంప్రదించి మాల విరమణ చేయవలసినదిగా కోరుతున్నామన్నారు. మీడియా సమావేశంలో ప్రధాన అర్చకులు లింగంబొట్ల దుర్గాప్రసాద్, అర్చకులు రంగావజ్జల శ్రీనివాస శాస్త్రి, ఏఎన్ వి డి ఎం ప్రసాద్, వేద పండితులు మంగిపూడి చెన్నకేశవ శాస్త్రి వున్నారు.