Breaking News

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ మూడవరోజు ఆదాయం

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
దసరా నవరాత్రులు మూడవరోజు బుధవారం నాడు వివిధ సేవల టిక్కెట్ లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 38 లక్షల 112 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ ఓ డి. భ్రమరాంబ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ఆలయానికి సమకూరిన ఆదాయాన్ని వివరిస్తూ రూ. 500 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 12 లక్షల రూపాయలు, రూ. 300 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 6 లక్షల 41 వేల 100 రూపాయలు, రూ. 100 టిక్కెట్స్ అమ్మకం ద్వారా రూ. 6 లక్షల 55 వేల 800 రూపాయలు ఆర్జించడం జరిగిందని, అలాగే లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 10 లక్షల 65 వేల 690 రూపాయలు, కుంకుమార్చన టిక్కెట్స్ ద్వారా రూ. 78 వేలు, ఇతర సేవలు ద్వారా రూ. 1 లక్ష59 వేల 522 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆ ప్రకటనలో ఈ ఓ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిన్నతనంలోనే కండరాల క్షీణత గుర్తింపుపై ప్రత్యేక దృష్టి: మంత్రి కందుల దుర్గేష్

-అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ శోభారాణి సుంకర సేవలు అభినందనీయమని కొనియాడిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *