విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్రంలో నిరుపేదలకు ఆర్థిక సామాజిక భరోసా కల్పించే దిశగా వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అమలు చేస్తూ వారికి అండగా నిలిచారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. గురువారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 3వ డివిజన్ నాగార్జున నగర్ నందు సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు సంయుక్తంగా ప్రజల ముంగిటకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారించడమే ధ్యేయంగా జగనన్న ఈ కార్యక్రమం రూపొందించారని, ప్రజల పట్ల బాధ్యత తో, జవాబుదారీతనంతో పని చేయడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది అని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం లో ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయంలో అసలు ప్రజల వైపు చూసేవారు కాదని,ప్రజలకు ఏదైనా పని ఉంటే కార్యాలయాల చుట్టూ తిరిగి లంచాలు ఇస్తే గాని అయ్యేది కాదని విమర్శించారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రభుత్వమే ప్రజల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో నేరుగా మాట్లాడి వారి స్పందన తెలుసుకోవడం సరికొత్తగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉండేవారికి ఎప్పటికి ప్రజాదరణ ఉంటుందని,ప్రజల కోసం ఇంతగా పరితపించే జగనన్న ప్రభుత్వనికి ప్రజలు అండగా ఉంటారని అవినాష్ ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ్, 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక, కో ఆప్షన్ సభ్యులు ముసునూరి సుబ్బారావు,వైస్సార్సీపీ నాయకులు ఏలూరి శివాజీ, పూర్ణచంద్ర రావు, దాడి సుబ్బారావు, సజ్జా కృష్ణ, డేవిడ్ రాజు, కిస్సి, వెంకట స్వామి, ఆనంద్, భీమిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …