
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
వధువులు ఎప్పుడూ కూడా తమ వివాహం కలకాలం మధురంగా నిలిచిపోవాలని కలలుకంటారు. ఆ రోజు తమ ఆహార్యం వైవిధ్యంగా ఉండాలని, ఈ ప్రపంచంలో తమకంటే గొప్ప ఫ్యాషన్ ఐకాన్ ఎవరూ లేరనిపించేలా తమ ధారణ ఉండాలని తలపోస్తారు. దాని కోసం రోజుల తరబడి తమ అన్వేషణనూ కొనసాగిస్తుంటారు. ఈ తరహా వధువుల కష్టాలను తొలగించేందుకు అంటూ హై లైఫ్ బ్రెడ్ ప్రదర్శన విజయవాడ లో ప్రారంభమైంది. సౌకర్యవంతమైన ఫ్యాషన్ అనుభవాలను, అత్యున్నత ఫ్యాషనబల్, అధునాతన మరియు డిజైనర్ చీరలు, బ్రైడల్ ఆభరణాలు, అప్పెరల్, యాక్ససరీలు మరియు మరెన్నో ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి. దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఎగ్జిబిషన్ బ్రాండ్ హై లైఫ్ ఎగ్జిబిషన్. అంతేకాదు, వివాహ అవసరాలను తీర్చే అతి పెద్ద ప్రదర్శనను సైతం ఈ బ్రాండ్ చేస్తుంటుంది. దీనిలో భాగంగా హై లైఫ్ టైడ్స్ ప్రదర్శన 29 సెప్టెంబర్ 2022 నుంచి 01 అక్టోబర్ 2022 వరకూ విజయవాడలోని నోవోటెల్ వరుణ్ హోటల్ వద్ద జరుగనుంది. ఈ సందర్భంగా హై లైఫ్ ఎగ్జిబిషన్స్ ఎండీ సీఈఓ మరియు హై లైఫ్ బ్రైడ్స్ చీఫ్ ఆర్గనైజర్ అబి.పి. డొమినిక్ మాట్లాడుతూ ” అతిపెద్ద ఎగ్జిబిషన్లలో హై లైఫ్ ట్రైడ్స్ ఒకటి. వెడ్డింగ్ ఫ్యాషన్స్, జ్యువెలరీ, ట్రైడల్ ఫ్యాషన్ అవసరాలతో పాటుగా ఫ్యాషన్ , లైఫ్ స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శించనున్నాము. హై లైఫ్ బ్రైడ్స్లో బ్రైడల్ డిజైనర్స్, జ్యువెలర్స్, ఫ్యాషన్ లేబుల్స్, వివాహ అవసరాల ప్రదాతలు కూడా ఉండనున్నారు” అని అన్నారు. కోవిడ్ మార్గదర్శకాలన్నీ అనుసరిస్తూ నిర్వహిస్తున్న ఈ ఎక్స్ క్లూజివ్ వెడ్డింగ్, బ్రైడల్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ 29 సెప్టెంబర్ 2022 నుంచి అక్టోబర్ 01, 2022 వరకూ విజయవాడలోని నోవోటెల్ వరుణ్ హోటల్ వద్ద జరుగుతుంది.
Prajavartha Online Telugu News