Breaking News

అక్టోబర్ 1న  క్రెడాయి విజయవాడ 8వ ప్రాపర్టీ షో 2022

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
అక్టోబర్ 1వ తేదీన  క్రెడాయి విజయవాడ 8వ ప్రాపర్టీ షో 2022  “A” కన్వెక్షన్ సెంటర్లో ప్రారంభమవుతుంది.  ఈ ప్రాపర్టీ షో అక్టోబర్ 1-2 రెండు రోజుల గ్రాండ్ ఈవెంట్ శనివారం – అదివారాల్లో జరుగుతుందని గురువారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ జరిగిన విలేఖరుల సమావేశంలో నిర్వాహకులు క్రెడాయి విజయవాడ ప్రెసిడెంట్ కె.రాజేంద్ర, జనరల్ సెక్రటరీ కె. రమేష్ అంకినీడు లు తెలిపారు. ఈ ప్రాపర్టీ షో స్థానిక మరియు రాష్ట్ర స్థాయి రియల్ ఎస్టేట్ మార్కెట్లకు ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. క్రెడాయి  గృహ కొనుగోలు అనుభవానికి ప్రత్యేకమైన మార్గాన్ని చూపిస్తుందని వినియోగదారులు వెతుకుతున్న ప్రతిదాన్ని ఒకే ఆవరణలో అందిస్తుందన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఒకే చోట వెండర్ ఉత్పత్తులు మరియు ఇంటి కొనుగోలుదారుకు నమూనా సరిపోల్చడం మరియు విశ్వాసంతో షాపింగ్ చేసే అవకాశాన్ని ఇస్తుందనన్నారు. గత ఏడు సంవత్సరాలుగా క్రీడాయి ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వంటి అనేక కార్పొరేట్ సామాజిక బాధ్యతలను (CSPC) ప్రారంభించి పూర్తి చేసింది. విజయవాడ నగరంలో పచ్చని చెట్లు పెంపకం, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచిత కూరగాయల పంపిణీ, నిర్మణ రంగ కార్మికుల కోసం వైద్య పరీక్షలు నిర్వహించడం, కోవిడ్ సమయాల్లో నిరుపేదలకు వస్తువుల పంపిణీ మరియు కోటెడ్ కాలంలో నిర్మాణ కార్మికులకు ఆహారం అందించడం మొదలైనవి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఇప్పుడు 8వ సంవత్సరంలో క్రెడాయి ప్రాపర్టీ షో విజయవాడ నగరంలో అత్యంత విశ్వసనీయమైన మరియు నగర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ప్రాపర్టీ షోగా పరిగణించబడుతోందన్నారు.ఈ కార్యక్రమంలో నిర్వాహకులు క్రెడాయి విజయవాడ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *