Breaking News

హిందీ పక్షోత్సవాలు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
దేశ ప్రజలందరినీ సమైక్యంగా ఉంచడంలో హిందీ భాష ముఖ్య భూమిక వహిస్తుందని ప్రాంతీయ భవిష్య నిధి కమిషనర్ రాజేశ్వర్ రాజేష్ అన్నారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో జరిగిన హిందీ పక్షోత్సవ ముగింపు సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ హిందీలో పని చేయడం ద్వారా రాజభాషణ గౌరవించాలని సూచించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సహాయ ప్రొఫెసర్ ఆచార్య కాకాని శ్రీకృష్ణ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సమరంలో ప్రజలందరినీ ఏకతాటిపై నడిపించింది హిందీ భాషేనని ప్రతి పౌరుడు హిందీ నేర్చుకోవాలని తలంపుతో మహాత్మా గాంధీ మద్రాసులో దక్షిణ భారత హిందీ ప్రచార సభలో స్థాపించారని తెలిపారు. సభలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న జెకెసి కళాశాల విశ్రాంత హిందీ ఆచార్యులు భాస్కరరావు మాట్లాడుతూ హిందీ సాహిత్యంలో చదవడం ద్వారా భారతదేశ సంస్కృతి, భారతీయుల జీవన విధానం అర్థమవుతుందని చెబుతూ కొన్ని చక్కని హిందీ కవితలను చదివి సబికులను అలరించారు. గత 15 రోజులుగా కార్యాలయంలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ తదితర పోటీలలో గెలుపొందిన ఉద్యోగులకు అతిథులు బహుమతులు ప్రధానం చేశారు. సభలో రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, సహాయ భవిష్య నిధి కమిషనర్ మాధవ శంకర్, సీనియర్ హిందీ అధికారి ఇందిరా రావు, సాంబశివరావు, రమేష్ బాబు, బాలసుబ్రమణ్యం తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వైద్య, ఆరోగ్య శాఖ‌లో ఏడెనిమిది వేల ఖాళీల భ‌ర్తీకి మంత్రి ఆదేశం

-ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌ల‌కు డాక్ట‌ర్లు, పేరా మెడిక‌ల్ సిబ్బంది నియామ‌కం అవ‌స‌ర‌మ‌న్న మంత్రి -మంజూరైన పోస్టులు, ఖాళీల‌పై మంత్రి స‌త్య‌కుమార్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *