రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
రాజమండ్రి లో ‘దసరా’ మహిళా సాధికారత ఉత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. దిశ బైక్ ర్యాలీ ఆర్ట్స్ కాలేజి నుంచి ప్రారంభమై సుబ్రహ్మణ్య మైదానం వరకు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎంపి భరత్ ర్యాలీనీ జెండా ఊపి ప్రారంభించగా, మంత్రి రోజా, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, అరకు పార్లమెంటు సభ్యురాలు మాధవి, రుడా ఛైర్పర్సన్ షర్మిల బైక్ రైడ్ లో పాల్గొన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన 15 స్టాల్స్ ని ప్రారంభించి మంత్రి రోజా, మంత్రి తానేటి వనిత,మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ మాధవి, మహిళా కమిషన్ సభ్యులు మహిళ నాయకులు కార్యకర్తలు సందర్శించారు. క్రీడాకారుల ప్రదర్శన, మహిళా శక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళా బృందాల కోలాటం ప్రదర్శనను మంత్రి వీక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత గారు, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు,మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ గారు, స్థానిక లోకసభ పార్లమెంటు సభ్యులు మార్గానీ భరత్ గారు, ఆరకు ఎంపీ మాధవి గారు, మహిళా కమిషన్ సభ్యులు మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై మంత్రి అచ్చెన్నాయుడు విచారం
-గొర్రెల కాపరి ఓబులపతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించిన మంత్రి అచ్చెన్నాయుడు -రహదారి ప్రమాదంలో గొర్రెల కాపరి ఓబులపతికి …