-స్టేట్ క్యాపిటల్ క్యాటగిరిలో (1 వ ర్యాంక్) కైవసం
-ఢిల్లీ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదగా అవార్డు స్వీకరించిన
-మున్సిపల్ శాఖా మంత్రి అదిమూలపు సురేష్ , మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
భారతదేశం గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అద్వర్యంలో న్యూఢిల్లీలోని తల్కటోర స్టేడియం 2022 అక్టోబర్ 1 న (శనివారం) నిర్వహించిన స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 ఫలితాలు, సఫాయిమిత్ర, సురక్ష ఛాలెంజ్, స్టార్ రేటింగ్, చెత్త రహిత నగరాలు మరియు ODF సర్టిఫికేషన్‌లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 కింద “ పరిశుభ్రత నగరాల” క్యాటగిరి నందు భారతదేశంలోని అన్ని నగరాల్లో విజయవాడ నగరం 5వ స్థానం కైవసం మరియు స్టేట్ క్యాపిటల్ క్యాటగిరిలో 1 వ స్థానం కైవసం చేసుకోవటం జరిగింది. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమములో మున్సిపల్ శాఖా మంత్రి అదిమూలపు సురేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి లతో కలిసి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర మంత్రి, గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేతుల మీదగా అవార్డ్ ను స్వీకరించారు. అదే విధంగా విజయవాడ నగరం 1. డోర్ టు డోర్ కలెక్షన్, 2. రోడ్ల పరిశుభ్రత, 3. పబ్లిక్ టాయిలెట్స్, 4. మార్కెట్ ఏరియాస్, 5. రెసిడెన్షియల్ ఏరియాస్, 6. డ్రైన్ల నిర్వహాణ, 7. చెత్త రహిత నగరముగా ఉండుట, 8. పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ రిడ్రేస్సల్, (ఫిర్యాదు సత్వర పరిష్కారాలు) 9. సిటి బ్యూటిఫికేషన్(నగర సుందరికరణ) నగరాల పారిశుద్ధ్య స్థితి మొదలగు క్యాటగిరి లలో విజయవాడ నగరం ఈ అవార్డు సాధించుట జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ విజయం సాధించడంలో తమ సహాయాన్ని అందించినందుకు ముఖ్యమంత్రికి కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ వర్కర్లు, వార్డు శానిటేషన్ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, హెల్త్ ఆఫీసర్లు మరియు ఇతర అధికారులు మరియు సిబ్బంది కి అభినందనలు తెలియజేస్తూ, ఈ గొప్ప కార్యంలో పాలుపంచుకోవటం ఆనందంగా ఉందని, విజయవాడ నగరానికి గర్వకారణమని కమిషనర్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ యొక్క టీమ్ వర్క్ ఫలితం ఈ అవార్డులతో సాధించుట అనడంలో సందేహం లేదని అన్నారు. విజయవాడ నగర పౌరులు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో వినయ పూర్వకమైన సహకారం అందించి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ అవార్డులను సాధించడం. వారి మద్దతు లేకుండా, సాధ్యం కాదని పేర్కొన్నారు. కార్యక్రమములో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి పాల్గొన్నారు.