విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 14 గ్రామాలలో భూముల రీసర్వే పూర్తి చేశామని సర్వేకు సంబంధించి ల్యాండ్ పార్శిల్ మ్యాప్ (ఎల్‌పియం) ప్రింటింగ్ దశలో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు భూపరిపాలన అదనపు కార్యదర్శి ఏ.యండి.ఇంతియాజ్‌కు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జగనన్న శాశ్వత భూహక్కు భూరక్షా పథకం పనుల్లో భాగంగా భూ రికార్డుల స్వచ్చీకరణ, సమగ్ర భూముల రీసర్వే ప్రక్రియపై భూపరిపాలన అదనపు కార్యదర్శి ఏ.యండి.ఇంతియాజ్ గురువారం జిల్లా కలెక్టర్లులు, జాయింట్ కలెక్టర్లు, సర్వే అధికారులతో ఆయన కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియ ప్రగతిని నగరంలోని కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ డిల్లీరావు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూముల రీసర్వే పూర్తి అయిన 14 గ్రామాలలో సర్వేకు సంబంధించి ల్యాండ్ పార్శల్ మ్యాప్ ప్రింటింగ్ ప్రక్రియ జరుగుతుందని వీటితో పాటు భూ హక్కుదారులకు జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పత్రాల డేటాను క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నామన్నారు. జిల్లాలోని విస్సన్నపేట, గంపలగూడెం, తిరువూరు, ఏ కొండూరు, రెడ్డిగూడెం, జగ్గయ్యపేట, కంచికచర్ల వత్సవాయి మండలాలలోని 136 గ్రామాలలో భూ సర్వే చేపట్టడం జరిగిందన్నారు. సర్వేకు సంబంధించి జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్‌పేట కంచికచర్ల మండలం పరిటాల, ఎ కొండూరు మండలం వామకుంట్ల, తిరువూరు మండలంలో మారేపల్లి, ఆంజనేయపురం, ముష్టికుంట్ల, చిట్యాల గ్రామాలు విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామం, గంపలగూడెం మండలంలో గంపలగూడెం, రాజవరం చన్నవరం, అనుమోలంక, కనుమూరు, వినగడప గ్రామాలలో పూర్తి చేసిన రీసర్వేలో ల్యాండ్ పార్శల్ మ్యాప్ ప్రింటింగ్ జరుగుతున్నట్లు కలెక్టర్ డిల్లీరావు, భూపరిపాలన అదనపు కార్యదర్శి ఎ.యండి ఇంతియాజ్‌కు వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్ ఉన్నారు.
Tags vijayawada
Check Also
ఉలి చెక్కిన కల
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర చెక్క కళాకారుల వారసత్వం చెక్క మలిచే కళాకారుల పరస్పర సహకార సంస్థ …