విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన విజయవాడ, భవానీపురం, బబ్బూరిగ్రౌండ్స్‌లో ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన-ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు, సంఘం అధ్య క్షుడు పల్లపోతు మురళీకృష్ణ (కొండపల్లి బుజ్జి) తెలిపారు. శుక్రవారం బబ్బూరిగ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించలేక పోయామని, అందుకే ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా 64 డివిజన్లలోని ఆర్యవైశ్యులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల మంది హాజరు కానున్నారని చెప్పారు. సుమారు 2 వేల మందికి సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చన్నారు. వైశ్యులు దందాలు చేసే వాళ్లం కాదు. సేవామూర్తులమన్నారు. కొందరు ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం నిమిత్తం తాము దందాలు చేస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాము చందాలు ఇచ్చేవారమే తప్ప దందాలు చేసేవారం కాదన్నారు. రాజకీయ నాయకులు తమ ఉనికిని చాటుకునేందుకు చేసే ఇటువంటి అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు బుద్ధా వెంకన్న తమపై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని మీ గతాన్ని మీరు గుర్తెరగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు స్పీడ్ సుబ్బారావు, అన్నం రామకృష్ణారావు, జి.రామమ్మోహనరావు, కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ, నంబూరు ప్రదీప్, డీ రాఘవ, పి.గంగా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, శోభాకరంద్లాజే తో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో రెండు రోజుల నిర్వహించిన ప్రవాస భారతీయ …