-ది.20.2.203 వ తేదీ నుం డి 7.3.2023 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
-థిరి పరీక్షలు 15.3. 2023 నుండి 4.4.2023 వరకు
-పరీక్షల సమయం లో సమస్య పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం.
-సమన్వయ శాఖలతో సమావేశం
– డి. ఆర్. ఓ, జి. నరసిం హులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహించనున్న ఇంటర్ మీడియట్ పరీక్షలకు సంబందించి పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. మంగళవారం డి. ఆర్. ఓ, ఛాంబర్ లో ప్రాంతీయ ఇంటర్మీడియేట్ అధికారి అధవర్యంలో 2023 ఇంటర్ మీడియట్ , ఓకేషనల్ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పై వివిధ శాఖల అధికారుల తో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ మీడియట్ , ఒకేషనల్ ప్రాక్టీకల్ పరీక్షలకు 32 సెంటర్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ పరీక్ష లు ఫిబ్రవరి 20 సోమవారం నుంచి మార్చి 7 మంగళ వారం వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. సాధారణ ప్రాక్టీకల్స్ పరీక్షలు తేదీ 26.2.2023 నుండి 7.3.2023 వరకు జరుగుతాయని తెలిపారు.
ఇంటర్ అకాడమిక్ (థిరి) పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం జిల్లాలో 72 కేంద్రాల్లో 26 వేల 931 మంది విద్యార్థులు హాజరు అవుతున్నారన్నారు. జిల్లా పరిక్షల కమిటీ ఛైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్, కన్వీనర్ ఆర్ ఐ ఓ, ఇతర సమన్వయ శాఖల అధికారులు ముగ్గురు ఉంటారని అన్నారు. హై పవర్ కమిటీ లో అధ్యక్షులుగా జిల్లా కలెక్టర్, మెంబర్ కన్వీనర్ గా ఆర్ ఐ ఓ, మరో నలుగురు సభ్యులు ఉండి, పర్యవేక్షణ చేస్తారని తెలిపారు.
పరిక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమ లు లో ఉంటుందని తెలిపారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 0883 2473430 ఏర్పాటు చేసామని తెలిపారు. పరీక్ష సమయం లో నిరంతరం విద్యుత్ ఇచ్చే విధం గా చర్యలు తీసుకోవాలని ట్రా న్స్ కో అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య పరంగా ఎటువంటి ఇబ్బందు లు రాకుండా మెడికల్ క్యాంపు ఏర్పాటు చెయ్యాలని వైద్య అధికారులను ఆదేశిం చారు.
ఈ కార్యక్రమం లో ఇంటర్ మీడియట్,ఆర్. ఐ. ఓ, ఎన్. ఎస్. వి. ఎల్. నరసింహం, డి. వి. ఈ ఓ, జె. వి. ఎస్. ఎస్. సుబ్రహ్మణ్యం, డిప్యూటీ డి. ఎం. హెచ్. ఓ, ఎన్. వసుంధర,
రిజర్వ్ ఇన్స్పెక్టర్ (పోలీస్) కేవి నరసింహన్, సి హెచ్ సూర్య భాస్కర్, ఈవోపిఅర్డి కె. అర్మస్ట్రాంగ్, ఆర్టిసి ఏ ఎం.. ఏం. అజయ్ బాబు, పోస్టల్ అధికారి ఎల్. శ్రీనివాస రావు, విద్యుత్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News