-అందుబాటులో ఉన్న పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలి
-కలెక్టర్ డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
చిన్న చేపల , తదితర అనుబంధ విక్రయ యూనిట్లు కింద ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఎస్సీ ఎస్టీ మహిళలకు 60 శాతం, జనరల్ కేటగిరీ వారికి 40 శాతం సబ్సిడీ తో లక్ష నుంచి 3 లక్షల వరకు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు.
స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆక్వా రంగం లో మార్కెటింగ్ వ్యూహ, అందుబాటులో ఉన్న పథకాలపై జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణారావు తో కలిసి కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, దేశీయ చేపల మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం ద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిపై మరింత ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత అన్నారు. స్థానికంగా చేపల మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ఎగుమతుల పై ఆధారపడకుండా స్థానిక వినియోగం ప్రోత్సహించాలన్నారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ప్రోత్సాహకాలు ప్రకటించడం, సబ్సిడీ అందచెయ్యడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 266 యూనిట్స్ లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు.
చేపల విలువ జోడించిన ఎంటర్ప్రైజెస్ యూనిట్లు – దినవారి వ్యాపార అభివృద్ధి కోసం యూనిట్స్ ఖరీదు రూ.10 లక్షల మేర జిల్లాకు 26 యూనిట్స్ లక్ష్యం నిర్దేశించడం జరిగిందన్నారు. చేపల విలువ జోడించిన ఎంటర్ప్రైజెస్ యూనిట్లు – సూపర్ కేటగిరీ కింద యూనిట్స్ ఖరీదు రూ.20 లక్షల మేర జిల్లాకు 11 యూనిట్స్ లక్ష్యం ఇవ్వగా రెండు యూనిట్స్ ఏర్పాటు చేశామన్నారు. చేపల విలువ జోడించిన ఎంటర్ప్రైజెస్ యూనిట్ – లాంజ్ కేటగిరీ విభాగంలో యూనిట్ ఖరీదు పరిమితి రూ.50 లక్షల వరకు ఉన్న కేటగిరీ కి చెంది జిల్లాకు రెండు యూనిట్స్ లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని, ఆ యూనిట్స్ స్థాపించినట్లు తెలిపారు. కస్టమైజ్డ్ యూనిట్స్ (మొబైల్ యూనిట్స్) రూ.3 లక్షల యూనిట్ ఖరీదు కి చెంది 19 యూనిట్స్ లక్ష్యం కాగా ఇప్పటికే రెండు యూనిట్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపకరణాలతో ప్రత్యక్ష చేపల కేంద్రం మొబైల్ యూనిట్ ఖరీదు రూ.21.20 లక్షలు – రూ.25 లక్షలు లో రూ.20 లక్షల యూనిట్ ఖరీదు సబ్సిడీ గా పరిగణించి 8 యూనిట్స్ లక్ష్యం ఇవ్వగా నాలుగు యూనిట్స్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని అన్నారు. ఉపకరణాలతో ఇన్సులేటెడ్ వాహనం ఉపకరణాలతో సుదూర ప్రాంతాలకు పాడైపోయే వస్తువుల సురక్షితంగా రవాణా కోసం మొబైల్ యూనిట్ ఖరీదు రూ.24 లక్షలు లో రూ.20 లక్షల యూనిట్ ఖరీదు సబ్సిడీ గా పరిగణించి 6 యూనిట్స్ లక్ష్యం ఇవ్వగా రెండు యూనిట్స్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణారావు, డి ఆర్ డి ఎ పీ డి ఎస్. సుభాషిణి, జిల్లా పశు సంవర్ధక అధికారి ఎస్ జి టి సత్య గోవింద్, డి ఈ వో ఎస్. అబ్రహం, ఎపిఎం లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News