-వైయస్ఆర్ చేయూత లబ్దిదారుల జీవనోపాధికి దిశా నిర్దేశం చెయ్యాలి
-దేశీయ చేపల మార్కెటింగ్‌ను ప్రోత్సహించడం
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పశు సంవర్ధక ఆధ్వర్యంలో జగనన్న చేయూత కింద 8,300 లబ్దిదారుల ద్వారా యూనిట్స్ ఏర్పాటు లక్ష్యం నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పశు సంవర్థక, మత్స్య శాఖ, డి ఆర్ డి ఎ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పేద, నిరుపేద కుటుంబలలో ఆర్థిక చేకూర్పు పెంచే దిశలో సంక్షేమ పథకాలలో భాగంగా వైయస్ఆర్ చేయూత పథకం అమలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో వైయస్ఆర్ చేయూత కింద మూడో విడత లో 12020 మందికి ఆర్థిక సహాయం రూ.18750 అందచెయ్యడం జరిగిందన్నారు. ఆ మొత్తం తో ఆర్థిక ప్రయోజనం కల్పించే యూనిట్స్ స్థాపన దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాకు చెంది 8300 యూనిట్స్ లక్ష్యం నిర్దేశించగా 5,383 (65%) మంది తమ ఆమోదం తెలపడం జరిగిందన్నారు. ఎప్పటి వరకు 3810 గ్రౌండింగ్ సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తి చేసి, 3008 మందికి బ్యాంకు రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా యూనిట్స్ ఏర్పాటు కై క్షేత్ర స్థాయి లో పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో ఈమేరకు యూనిట్స్ ఏర్పాటు చేసే ప్రక్రియకి బ్యాంకు రుణాలు మంజూరు కు చెంది జిల్లా రాష్ట్ర స్థాయి లో ప్రథమ స్థానం లో ఉన్నామని, వాటి ద్వారా కార్యకలాపాలు చేపట్టాలని అన్నారు. వచ్చే వారంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి పర్యటన నేపథ్యంలో క్షేత్ర స్థాయి లో యూనిట్స్ తనిఖీ చేసే అవకాశం ఉన్న దృష్ట్యా ఆమేరకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు. నిబద్దతతో పని చెయ్యని క్షేత్ర స్థాయి సిబ్బంది సేవలు అవసరం లేదని, అటువంటి వారిపై శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు స్పష్టం చేశారు. హౌసింగ్ రుణాలకు సంబంధించి 34,920 మందికి గాను 21,237(61%) మేర లక్ష్యాలను సాధించడం జరిగిందని, మిగిలిన రుణాల మంజూరులో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయం పరిధిలో ఉన్న సంక్షేమ కార్యదర్శులు సచివాలయల వారీగా డేటా అనాలిసిస్ చెయ్యాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ పీ డి ఎస్. సుభాషిణి, జిల్లా పశు సంవర్ధక అధికారి ఎస్ జి టి సత్య గోవింద్, జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణారావు, డి ఈ వో ఎస్. అబ్రహం, ఎపిఎం లు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News