జిల్లాలో ఏడు మండలాల పరిధిలో రూ.130.15 లక్షలతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్

– జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్ లో 4 మండలాల్లో రూ.78.75 లక్షలతో, కొవ్వూరు డివిజన్ పరిధిలో 3 మండలాల్లో రూ.51.40 లక్షలతో తూర్పు, పశ్చిమ వాటర్ గ్రిడ్ ద్వారా త్రాగునీరు అందచేసే ప్రాజెక్ట్ కు పరిపాలన పరమైన అనుమతులు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా గ్రామీణ నీటి సరఫరా సంస్థ సూపరింటెండెంట్ ఇంజనీర్ డి. బాలశంకర్ రావు తదితరులతో ప్రాజెక్ట్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత జిల్లా పరిధిలోని ఏడు మండలాలలో ఉన్న 101 గ్రామ పంచాయతీలకు చెందిన 178 నివాస ప్రాంతాలు ( హబిటేషన్స్) కు రక్షిత తాగునీరు అందచేసే తూర్పు, పశ్చిమ వాటర్ గ్రిడ్ పనులకు చెంది పరిపాలన ఆమోదం పొందడం జరిగిందన్నారు. రాబోయే 30 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా త్రాగు నీరు అందించే సామర్థ్యం కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజమండ్రి రూరల్ 10 గ్రామాలు (40 నివాస ప్రాంతాలు) కడియం లో 11 గ్రామాలు (32 నివాస ప్రాంతాలు), అనపర్తి 11 గ్రామాలు (19 నివాస ప్రాంతాలు) , బిక్కవోలు గ్రామాలు (28 నివాస ప్రాంతాలు) ల ద్వారా 4,62,203 మందికి రూ.78.75 లక్షలతో రక్షిత త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా కొవ్వూరు డివిజన్ పరిధిలోని నిడదవోలు నియోజకవర్గం లో గ్రామీణ ప్రాంతం నిడదవోలు మండలం లో 23 గ్రామాలు (25 నివాస ప్రాంతాలు), పెరవలి లో 18 గ్రామాలు (28 నివాస ప్రాంతాలు), ఉండ్రాజవరం లో 15 గ్రామాలు (16 నివాస ప్రాంతాలు) లో ఉన్న 2,27,403 మందికి రూ.51.40 లక్షలతో రక్షిత త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *