డ్రాప్ అవుట్ విద్యార్థుల వివరాలు క్షేత్ర స్థాయి అధికారులు వద్ద ఉండాలి

-ట్యాబ్స్ వినియోగం పై ఎమ్ ఈ ఓ లు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి
-ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ట్యాబ్ వినియోగం పై ప్రోత్సాహించాలి
-సి, డి గ్రేడ్ విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు
-పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక కార్యాచరణ తో నూరు శాతం మెరుగైన ఉత్తీర్ణత సాధించాలి
-వచ్చే వారం స్కూల్స్ కి ఆహార పదార్థాలు సరఫరా చేసే ఏజెన్సీ వారితో సమావేశం
-సంక్షేమ పథకాలు అమలు లో కనీస విద్యా అర్హత ఆదర్శనీయం
-ఆ దిశలో విద్యా ప్రమాణాలు పెంచడం లో మనవంతు భాగస్వామ్యం అవ్వాలి
-కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా విధానం లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి బోధన, బోధనేతర అంశాలపై మండల విద్యా అధికారులు, డిఆర్డీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు.

స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం విద్యా శాఖ పై మండల విద్యా అధికారులు, ఏ పి ఎం లతో డ్రాప్ అవుట్స్, నాడు నేడు పనులు, మిడ్ డే మీల్స్ (జగనన్న గోరు ముద్ద), ట్యాబ్ ల వినియోగం, 10 వ తరగతి ఫలితాలపై అంశాల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

మన బడి నాడు నేడు కింద రివాల్వింగ్ ఫండ్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  జిల్లాలో 675 స్కూల్స్ లో నాడు నేడు పనులు చేపడుతుండగా వాటిలో  50 స్కూల్స్ లో 20 నుంచి లక్ష రూపాయలు పైబడిన పెండింగ్ పనులను పూర్తి చెయ్యవలసి ఉందన్నారు. మండల ఇంజినీరింగ్ అధికారులు వారి పరిధిలో ఉన్న స్కూల్స్ లో చేపట్టవలసి ఉన్న పనులు పూర్తి చేయడం కోసం అవసరమైన ముడి సరుకు, తదితర అంశాల పై 50 స్కూల్స్ వారీగా కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించినా ఎందుకు ఆయా పనులు పూర్తి చెయ్యలేదని ప్రశ్నించారు. నాడు నేడు పనులకు చెందిన నిధులు మిగిలిఉన్న 50 స్కూల్స్ త్వరితగతిన ఆయా పనులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా నిధులు కేటాయించి విడుదల కాకపోతే వాటి వివరాలు అందించాలని అన్నారు.

జగనన్న గోరుముద్ద పై సమీక్ష:
జగనన్న గోరుముద్ద పధకం కింద ఎంతో పౌష్టి కాహరం, సమతుల్య ఆహారం తో కూడిన ఆహారాన్ని అందించడం జరుగుతోందని, నూటికి 95 శాతం మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతోందని అన్నారు. విద్యార్థుల నుంచి స్పందన తెలుసుకుని ఆ మేరకు ప్రక్షాళన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవ్వూరు, నిడదవోలు మండలం పరిధిలో  విద్యార్థులు జగనన్న గోరుముద్ద ఆహారం పథకం కింద అమలు చేస్తున్న ప్రణాళిక ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇదే విధమైన  కార్యాచరణ మిగిలిన స్కూల్స్ లో అమలు చేయాలని, ఇందుకు జిల్లా విద్యా అధికారి క్షేత్ర స్థాయి అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మధ్యాహ్న పథకం అమలులో భాగంగా అందచేసే కోడిగుడ్ల వారం వారం కలర్ కోడ్ ఇవ్వడం జరుగుతోందని అన్నారు. నెలలో ప్రతి వారం ఒక కలర్ ఇవ్వడం జరుగుతుంది.  మొదటి వారం బ్లూ (నీలం) , రెండోవ వారం పింక్ (గులాబీ), మూడో వారం గ్రీన్ (ఆకుపచ్చ),  నాలుగో వారం పర్పుల్ (ఉదా రంగు) అందచేసే కోడి గ్రుడ్ల రంగుల వివరాలు తప్పనిసరిగా స్కూల్స్ తనిఖీ సమయంలో పరిశీలన చేయాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఎదుర్కొంటున్న సమస్యలు తెలియచేస్తే వాటి పరిష్కారం చర్యలు చేపడతామని అన్నారు. వచ్చే వారం సంబంధిత ఏజెన్సీ వారితో సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా ఆమేరకు ముందస్తుగా వివరాలు అందచేయాలని ఆదేశించారు.

ఎన్ ఆర్ ఎస్ టి విద్యా కేంద్రాలు :

నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్  కింద కోరుకొండ మండలం లో కాపవరం, కోరుకొండ లలో కేంద్రాలు నిర్వహిస్తున్నామని, రాజమహేంద్రవరం పట్టణ ప్రాంతంలో మరో ఐదు స్కూల్స్ లో ఏర్పాటు చేయాడానికి ప్రతిపాదనను పంపినట్లు కలెక్టర్ తెలిపారు.

బడి బయట పిల్లలు:
జిల్లాలో 1399 మంది బడిబయట పిల్లలను గుర్తించి, వారిలో 315 మంది ని తిరిగి స్కూల్స్ లో జాయిన్ చేశామన్నారు. అయితే బడి బయట పిల్లల భాధ్యత పూర్తిగా ఎం ఈ ఓ లదే అని కలెక్టర్ మాధవీలత అన్నారు. ఇంకా బడిబయట ఉన్న 1084 మందిలో 869 మంది వేరే ప్రాంతానికి వలస వెళ్లినట్లు అధికారులు వివరించారు.

10 వ తరగతి బోధన పై సూచనలు:
పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల సామర్థ్యం పై , ఉత్తమ ఫలితాలు వచ్చేలా స్కూల్స్ తనిఖి సందర్భంలో విద్యా ప్రమాణాలు పరిశీలన చెయ్యాలని కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. ఈ దిశలో మండల విద్యా అధికారులు, ఏ పి ఎం లు వ్యక్తిగత శ్రద్ధ, పర్యవేక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు లో విద్యా అర్హతలు ఉండాలనే నిబంధన దృష్ట్యా ఆదిశలో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రులకు అవగాహన పెంచాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల హాజరు, విద్యా నైపుణ్యం వంటి వాటిపై క్షేత్ర స్థాయి తనిఖీల్లో భాగంగా తప్పనిసరిగా పరిశీలన చేసి, నివేదిక ఇవ్వాలని సూచించారు. సిలబస్ ప్రకారం తరగతులలో బోధన ప్రణాళిక పై విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకోవాలని అన్నారు.

ట్యాబ్ ల వినియోగం పై :

జిల్లాలో విద్యార్థులకు 16024, ఉపాధ్యాయులకు 1802 ట్యాబ్ లను పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ మాధవీలత అన్నారు. ట్యాబ్ ల వినియోగించడం పై విద్యార్థుల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ట్యాబ్ లలో పొందుపరచిన బోధనా అంశములు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. ఏం ఈ వో లు తప్పనిసరిగా ట్యాబ్ ల పనితీరును పరిశీలించి అవగాహన కలిగితే, స్కూల్స్ తనిఖీలో వారి ప్రశ్నించి విషయ సేకరణ సాధ్యం అవుతుందని అన్నారు. ఉపాధ్యాయులు, ప్రధనోపాద్యాయులు కూడా ట్యాబ్ లను పరిశీలించడం, అందులో పొందుపరిచిన వాటిపై సంపూర్ణ అవగాహన కలిగి వుండాలి అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి ఎస్. అబ్రహం, పి డి డి ఆర్ డి ఎ ఎస్. సుభాషిణి, జెడి (పశుసంవర్ధక) ఎస్ జి టి. సత్య గోవింద్, జిల్లా మత్స్య అధికారి కె వి కృష్ణా రావు, ఏం ఈ వో లు, ఏ పి ఎమ్. లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *