-వై జంక్షన్ నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ
-ఇకపై ప్రతినెలా 14 వ తేదీ ఆరోగ్యం పట్ల అవగాహన కోసం కార్యక్రమాలు చేపడతాం
-శారీరక, మానసిక ఎదుగుదలకు వ్యాయాయం తోడ్పడుతుంది
-ప్రతి ఒక్కరూ వారానికి ఒక్క రోజైనా సైకిల్ నడపాలి
-జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శారీరక , మానసిక ఎదుగుదలకు ప్రతిరోజు సైక్లింగ్ చేయటం వలన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత జిల్లా కలెక్టర్ డా. కె మాధవీలత పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఆజాదీకా అమృతమహోత్సవంలో భాగంగా కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో “సైకిల్ ఫర్ హెల్త్” అనే నూతన కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక వై జంక్షన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు నిర్వహించే సైకిల్ ర్యాలీని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విద్యార్థులతో కలసి నిర్వహించిన సైకిల్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కొరకు నిత్యజీవితంలో ప్రతిరోజు సైక్లింగ్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. నేడు యాంత్రీకరణ వ్యవస్థ లో మనం జీవిస్తూ, వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు వారి దినచర్య కార్యక్రమంలో వారానికి ఒక రోజైనా సైక్లింగ్ , వ్యాయామాన్ని తప్పనిసరిగా చేయాలన్నారు. పిల్లలు, పెద్దలు వీలైతే ప్రతిరోజు కూడా చేసినట్లయితే శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని పేర్కొన్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉండటం సాధ్యం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రతి పీహెచ్ సీ, యుపీహెచ్ సీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కేంద్రాల పరిధిలో ఇకపై ప్రతి నెల 14 వ తేదీ ఒక్కొక్క సెంటర్ లో ఆరోగ్యం పై ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నేడు జిల్లా స్థాయి “సైకిల్ ఫర్ హెల్త్” అవగాహన ర్యాలీనివైద్య అధికారులు, విద్యార్థులతో కలిసి నిర్వహించామన్నారు. ఇందుకు సంబందించి వైద్య ఆరోగ్యశాఖ, విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థలు సైకిల్ ర్యాలీలో పాల్గొనే విధంగా ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో వైద్య ఆరోగ్యశాఖ ముందు కెళుతుందన్నారు. ఈ సందర్భంగా సైకిల్ ఫర్ హెల్త్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను, ఉద్యోగస్తులను కలెక్టర్ అభినందించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నెలలో ప్రతి ఫిబ్రవరి 14వ తేదీ జిల్లాలోని వివిధ కేంద్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో “సైకిల్ ఫర్ హెల్త్ , ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే వ్యాయమ పరమైన అంశాలతో”ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు.
క్యాన్సర్ పై అవగాహన, నిశ్చయ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని , నాన్ కమ్యూనికల్ వ్యాధుల పై స్క్రీనింగ్ లో ట్రీట్మెంట్ కొరకు ప్రతి వైయస్సార్ హెల్త్ క్లినిక్ నందు మొదటి శనివారం, మూడో శనివారం తనిఖీలు చేయబడతాయన్నారు. సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ కొరకు రెండవ శనివారం నాలుగవ శనివారం స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు.
కార్యక్రమంలో డీఎంహెచ్వో డా. కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ డిఎంహెచ్వో డా. ఎన్ వసుంధర, డి సి హెచ్ ఓ డాక్టర్ సనత్ కుమారి, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News