రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బేటి బచావో బేటి పడావో కార్యక్రమము షెడ్యూల్ ప్రకారం పక్కాగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే వెంకటేశ్వరరావు వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో బేటి బచావో బేటి పడావో అనే కార్యక్రమం అమలుపై సంబంధిత వైద్యాధికారులు వైద్య సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో లో భాగంగా ఆడపిల్లల పుట్టుకలను కాపాడండి ఆడపిల్లలను చదివించండి….
ఆడపిల్లలను రక్షించండి..
అనే నినాదంతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమములను మార్చి నెల మొదటి తేదీ నుండి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయినదన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా 1.3.2023 వ తేదీన ట్విట్టర్ ఎకౌంటు ఓపెన్ చేసి అందులో కార్యక్రమమునకు సంబంధించిన ఫోటోలను వివరాలను అప్లోడ్ చేయాలని తెలియజేశారు.
*రెండో తేదీ న కస్తూరిబా కస్తూరిబా గాంధీ విద్యాలయాలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలియజేశారు.
*మూడవ తేదీన స్ట్రీట్ వాక్ బ్యానర్ పట్టుకుని స్కానింగ్ సెంటర్స్ ఉన్న వీధులలో ఒక జిల్లా అధికారి,మెడికల్ ఆఫీసర్ ,హెల్త్ ఎడ్యుకే టర్ తో కూడిన టీం తో పురవీధులలో ర్యాలీ చేయాలని నిర్ణయించాలాన్నారు.
*నాల్గవ తేదీన మెడికల్ ఆఫీసర్స్ డిస్టిక్ ఆఫీసర్ స్కాన్ సెంటర్స్ ని విజిట్ చేయాలని తెలియజేశారు.
* ఆరో తేదీన స్కాన్ సెంటర్ లపై డెకాయ్ ఆపరేషన్లు చేపట్టాలని తెలియజేశారు.
*ఏడో తేదీన భేటీ బచావో బేటి పడావో అనే అంశానికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వీడియో క్లిప్పింగ్ ట్విట్టర్ మరియు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని తెలిపారు.
*ఎనిమిదో తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఆఫీసులోనూ ఇంటర్నల్ కంప్లైంట్ సెల్ , సెక్సియల్ హెరాస్మెంట్ పై ఏర్పాటు చేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమం అన్ని పీహెచ్సీ పరిధిలోను సచివాలయం పరిధిలోను అన్ని ప్రభుత్వ శాఖలవారు సహకారంతో విజయవంతం చేయాలని వెంకటేశ్వరరావు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో Dr జి వరలక్ష్మి డిఐఓ i/c డాక్టర్ కె సాయి కిరణ్ ఆర్థోపెడిషన్ , టీ నాగమణి సిడిపిఓ , డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీవల్లి ఎన్ సత్య కుమార్ డిప్యూటీ డెమో ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News