-ముస్లిమ్ సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముస్లిమ్ సోదరులు అత్యంత భక్తి శ్రద్దలతో నెల రోజుల పాటు చేసిన ఆరాధన ఫలించే రోజైన రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైంది. ముస్లిమ్ సోదరులు పరమనిష్టతో చేసే ఉపవాసం ఎంతో గొప్పదని ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే రంజాన్ పండుగ సందర్భంగా పాటించే నియమాలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పవిత్ర గ్రంథం ఖురాన్ బోధనలతో సమాజాన్ని తీర్చిదిద్దే రంజాన్ పండుగను ముస్లిమ్ కుటుంబ సభ్యులు ఆనందఉత్సహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు శుభాకాంక్షలు తెలిజయేశారు.రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఐదు ప్రాథమిక విధులను తప్పనిసరిగా నిర్వర్తిస్తారు. ఇమాన్, నమాజ్ జకాత్, రోజా, హజ్ అనే విధులను పాటించాలి కరుణామయుడైన అల్లాప్‌ా పై పూర్తి విశ్వాసం ఉంచడమే ఇమాన్‌అల్లా అందరినీ చల్లగా కాపాడేలా ఆశీస్సులు అందించాలని ముస్లిమ్ ప్రార్ధనలో కోరుకోవటం విశేషం. రంజాన్ అనేది పండుగ పేరు కాదు ఇస్లామిక్ క్యాలెండర్లోని 9వ నెలను రంజాన్ మాసం అని అంటారు. ఈనెలలోనే ముస్లింల పవిత్ర గ్రంధమైన ఖురాన్ స్వర్గం నుంచి భూమికి వచ్చిందని విశ్వాసం, మానవత్వానికి అద్దంపట్టే ధర్మసూత్రాలు ఇస్లాంలో ఉన్నాయి. నమాజ్ దగ్గర నుంచి రోజు అవలంబించే పద్దతుల వరకు ఎన్నో మంచి విషయాలను ఇస్లాం నుంచి ఆదర్శంగా తీసుకోవాలని కోరుతూ ముస్లిమ్ సోదర సోదరిమణులకు అధికారులకు ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డిల్లీరావు రంజాన్ శుభాకాంక్షలు తెలిజేశారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …