-శాసనసభ్యులు వేలంపల్లి నివాసరావు
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ శుక్రవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ గాంధిజీ కళాశాల, విధ్యాధరపురం షాదిఖానా, మోతి మస్జిద్ ఈద్గాహ్, స్టేడియం సితార సెంటర్ ను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులువేలంపల్లి నివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలసి రంజాన్ పండుగను పురష్కరించుకొని నమాజ్ చేసుకొనుటకు జరుగుతున్న ఏర్పాట్లును పరిశీలిస్తూ అక్కడ తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని షామియానా, కార్పెట్, త్రాగునీరు మొదలగు వాటితో పాటుగా పరిసరాలు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.అదే విధంగా రంజాన్ పండుగ నాడు నగర పరిధిలో నమాజ్ చేసుకోను అన్ని ప్రాంతాలలో ప్రజలకు ఎటువంటి ఇబ్బoదులు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకువాలని అన్నారు. ఆయా ప్రదేశాలలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ విధానమును అవలభించాలని అన్నారు. ఈ సందర్భంలో ఆయా ప్రదేశాలలో రోడ్ మార్జిన్ లలో చెత్త మరియు డెబ్రిస్ ఉండుట గమనించి తక్షణమే వాటిని తొలగించి మార్జిన్ లను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …