విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలలో భాగంగా అర్హులైన ప్రతి లబ్ది దారుడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు.సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో పంపిణి చేయనున్న జగనన్న ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆయన కార్యాలయంలో విడుదల చేసారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్రము అమలు చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఏ నెలలో ఏ ఏ సంక్షేమ పథకాల లబ్ది అందిస్తున్నామనే విషయాన్ని ముందుగానే ప్రకటించి ఇందుకు అనుగుణంగా సంక్షేమ క్యాలెండర్ ను రూపొందించడం అభినందనీయమన్నారు. జనవరి మాసంలో వైఎస్సార్ భరోసా, వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు, వైయస్సార్ లా నేస్తం, వైయస్సార్ పెన్షన్ కానుక, ఫిబ్రవరి మాసంలో జగనన్న విద్య దీవెన, వైయస్సార్ కల్యాణ మస్తు, వైయస్సార్ ఈబీసీ నేస్తం, మార్చి మాసంలో జగనన్న వసతి దీవెన, ఎం ఎస్ ఎం ఈ లకు ప్రోత్సహకాలు, ఏప్రిల్ మాసంలో జగనన్న వసతి దీవెన, వైఎస్సార్ ఈబీసీ నేస్తం మే మాసంలో వాలంటీర్లకు వందనం, వైయస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల భీమా, జగనన్న విద్య దీవెన, వైయస్సార్ కల్యాణ మస్తు, మత్యకార భరోసా జూన్ మాసంలో జగనన్న విద్య కానుక, అమ్మఒడి, వైయస్సార్ లా నేస్తం, జులై మాసంలో జగనన్న విదేశీ విద్య దీవెన, వైయస్సార్ నేతన్న నేస్తం, ఎం ఎస్ ఎం ఈ లకు ప్రోత్సహకాలు, జగనన్న తోడు, వైయస్సార్ సున్నా వడ్డీ, వైయస్సార్ కళ్యాణమస్తు, ఆగష్టు మాసంలో జగనన్న విద్య దీవెన, వైయస్సార్ కాపు నేస్తం, వాహనమిత్ర, సెప్టెంబర్ మాసంలో వైయస్సార్ చేయూత, అక్టోబర్ మాసంలో వైయస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, నవంబర్ మాసంలో వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, కళ్యాణమస్తూ, జగనన్న విద్య దీవెన, డిసెంబర్ మాసంలో విదేశీ విద్య దీవెన, జగనన్న చేదోడు పథకాల లబ్ది దారులకు క్రమం తప్పకుండా వారి ఖాతాల్లో సొమ్మును జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ది గురించి ప్రజలకు తెలియచేసేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షేమ క్యాలెండర్ ను ప్రదర్శించేలా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు.క్యాలెండర్ విడుదల కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాధికారి యు. సురేంధ్రనాధ్, డిపిఆర్ఓ ఎస్.వి. మోహన్ రావు, ఏ.వి. సూపర్ వైజర్ ఏ. సాయి బాబా, పబ్లిసిటీ అసిస్టెంట్ వి.వి. ప్రసాద్ తదితరులు ఉన్నారు.
Tags vijayawda
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …