-ఇంటింటి చెత్త సేకరణకు సహకరించండి
-యూజర్ చార్జీలను క్రమంతప్పకుండా చెల్లించండి
-కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజక వర్గ సర్కిల్-3 పరిధిలో గల 13 & 14 వ డివిజన్ల లో మంగళవారం ఉదయం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల యొక్క పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు.స్థానిక 13 వ డివిజన్ జె.డి నగర్ లో మరియు 14 డివిజన్ లో శాంతి నగర్, ఎన్.ఎస్.ఎం. స్కూల్ ఏరియా, దర్శిపేట లో పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా డివిజనుల్లో జరుగుతున్న చెత్త సేకరణ పనులను కమిషనర్ పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలోని శానిటేషన్ సిబ్బంది హాజరును కమిషనర్ పరిశీలించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యాచరణలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్న డోర్ టు డోర్ చెత్త సేకరణ యూజర్ చార్జీలను క్రమం తప్పకుండా చెల్లించి నగరాభివృద్ధికి తోడ్పడాలని కమీషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ కోరారు.స్థానిక ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ చెత్త సేకరణ తడి, పొడి చెత్తను విడివిడిగా చెత్త సేకరణ వాహనాలకు అందించాలని సూచించారు. చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే గృహ వ్యర్ధాలను అందించాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేస్తే జరిమానాలు విధిస్తామని, చెత్తను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా సేంద్రీయ ఎరువులుగా మార్చి తిరిగి ప్రకృతిలోకి తీసుకురాగలమని కమిషనర్ ప్రజలకు వివరించారు. వాహనాలకు కాకుండా బహిరంగ ప్రదేశాల్లో, డ్రైను కాలువల్లో చెత్తను వేయడం వలన దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యాలు కలుగుతాయని కమిషనర్ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరాదని అవగాహన కల్పిస్తూ సచివాలయాల పరిధిలోని ప్రతీ ఇంటికి నోటీసులు అందించాలని కార్యదర్శులను కమిషనర్ ఆదేశించారు.
ఈ పర్యటనలో 14 వ డివిజన్ కార్పొరేటర్ చింతల సాంబశివరావు, డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ కరిముల్లా, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రటరీలు, సచివాలయ మరియు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …