-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా అధికారులతో కలసి పారిశుధ్య నిర్వహణ విధానము పరిశీలించారు. 24, 5, మరియు 3 డివిజన్లలో మొగల్రాజపురం, క్రిస్తురాజుపురం, గుణదల, గంగిరెద్దుల దిబ్బ పలు ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో గల మౌలిక సదుపాయాలు ముఖ్యంగా . ‘వీధి దీపాలు వెలగకపోవడం, బ్లాక్‌స్పాట్ ప్రాంతాలు (తగినంత వెలుతురు లేకపోవడం), దోమల బెడద, డ్రైనేజీ పారుదల మొదలైన పౌర సమస్యలను క్షేత్ర స్థాయిలో అర్థం చేసుకోవడం రాత్రి తనిఖీ వెనుక ముఖ్య ఉద్దేశం. మొగల్రాజపురం లో దోమల బెడదను గమనించి, దోమలు వృద్ధి చెందుటకు గల కారణాలు మరియు లార్వా నిర్మూలనకు చేబడుతున్న ఆయిల్ బాల్స్ మరియు ఫాగింగ్ కార్యకలాపాలను రెట్టింపు చేయడానికి అదనపు కార్మికులను ఏర్పాటు చేయాలనీ హెల్త్ అధికారులను ఆదేశించారు. దోమల వృద్ధిని నిరోధించడానికి కాలువలలో నీటి నిల్వలను నివారించడానికి డ్రైన్ క్లీనింగ్ పనులు నిర్వహించాలని అన్నారు. క్రిస్తురాజుపురం, గుణదల, గంగిరెద్దుల దిబ్బ పలు ప్రాంతాలలో రోడ్ల ప్రక్కన చెత్త ను పారవేయడం గమనించి పారిశుధ్య నిర్వహణ సరిగ్గా లేదని హెల్త్ అధికారులను హెచ్చరించి క్లీనింగ్ పనులు నిర్వహించాలని అన్నారు.
డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు సంబందించి డోర్ టు డోర్ చెత్త సేకరణ తీరును అడిగితెలుసుకొన్నారు. ప్రధాన వీధులలో రోడ్ స్విప్పింగ్ పూర్తి అయిన వెంటనే అంతర్గత రోడ్లు శుభ్ర పరచి 100 శాతం నివాసాల నుండి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య సిబ్బంది ఆదేశించారు. అదే విధంగా సైడ్ డ్రెయిన్లలో మురుగునీటి పారుదలకు అవరోధకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి డ్రెయిన్ల ద్వారా మురుగునీటి పారుదల సక్రమముగా జరిగేలా చూడాలని అన్నారు. డివిజన్ పరిధిలో మంచినీటి సరఫరా విధానమునకు సంబందించి వాటర్ పైప్ లైన్ లీకేజిలు లేకుండా చూడాలని మరియు యు.జీ.డి నందలి మురుగునీటి పారుదలలో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు