విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నందు ది.12.05.2023 తేది నుండి ది.17.05.2023 తేది వరకు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించు చండీ, రుద్ర, రాజ శ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం పురస్కరించుకొని చేయు పారిశుధ్య నిర్వహణ, టాయిలెట్స్ మరియు మంచినీటి కౌంటర్ల ఏర్పాట్లపై ఈ రోజు ది.11.05.2023 తేదిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం మరియు పరిసర ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ మరియు ప్రధాన మరియు అంతర్గత రోడ్ల యందలి పారిశుధ్య నిర్వహణ విధానము మరియు సైడ్ డ్రెయిన్స్ నందలి మురుగునీటి పారుదల విధానము పర్యవేక్షించి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు తగిన విధంగా ఏర్పాట్లపై అధికారులకు మరియు సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపద్యంలో కమీషనర్ మాట్లాడుతూ……. ఆరు రోజుల పాటు విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నందు రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మహా యజ్ఞ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది. పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లలో ఎక్కడా అలసత్వం ప్రదర్శించకుండా శానిటేషన్ పై ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని స్టేడియం మరియు స్టేడియం పరిసర ప్రాంతాలలో శానిటేషన్ నిర్వహించాలని, ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరియు ఎటువంటి ప్రమాదాలు, అవాంచనీయ సంఘటనలు జరుగకుండా అన్ని శాఖల సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు అందించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల, జోనల్ కమిషనర్-2 యు. సృజన, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలాజీ, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ శ్రీనివాసు, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …