విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వర్కింగ్ జర్నలిస్టుల కుటుంబాలకు శనివారం నాడు లయోలా ఇంజనీరింగ్ కాలేజీలో ఎపి వైద్య ఆరోగ్య శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు మణిపాల్ హాస్పిటల్ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ లను వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు పరిశీలించారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రోజుకు ఎంత మందికి స్క్రీనింగ్ చేయగలరని గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు మణిపాల్ హాస్పిటల్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ పై మహిళలకు అవగాహన కల్పించాలని సమాచార పౌర సంబంధాల అధికారులకు సూచించారు. ఆరోగ్య శ్రీ సిఇవో ఎం.ఎన్.హరీందరప్రసాద్, సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ తుమ్మా విజయకుమార్ రెడ్డి , ఆరోగ్య శ్రీ జిల్లా కో-ఆర్డినేటర్ డాక్టర్ సుమన్ తదితరులు కృష్ణ బాబు వెంట ఉన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …