విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆమరణ నిరాహార దీక్షలో కూడా గాంధీ దేశం ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ మానవత్వాన్ని చాటుకున్నారు. శుక్రవారం ఊర్మిళానగర్‌లోని గాంధీ దేశం ట్రస్ట్ కార్యాలయం వద్ద మొదటి రోజు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ తనదైన శైలిలో తన ధాతృత్వాన్ని, మానవత్వాన్ని చాటుకుని తన కోసం దీక్షా శిబిరానికి వచ్చిన ఆరోగ్యం సరిగా లేకుండా కాళ్ళు చేతులు సరిగా పనిచేయని స్థితిలో మాట్లాడలేని అబ్దుల్లా అనే ఓ యువకుడికి భోజన సమయంలో తాను దీక్షలో వున్నా కూడా తన తోటి వారి కోసం పాటుపడే ఆయన తన చేతులతో అతని భోజనం పెట్టడం అభినందనీయం. ఈ సందర్భంగా గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ అబ్దుల్లా అనే ఈ యువకుడు తన స్థానికుడని ఎప్పటి నుంచో తన దగ్గరకు వచ్చి తన చేతులతో భోజనం పెట్టించుకుని సంతృప్తితో వెళ్ళి సందర్భాలున్నాయన్నారు. ఏదైనా తట్టుకోవచ్చుగాని ఆకలిని మానవుడు తట్టుకోలేడని ఆ సమయంలో తన ఆకలిని తీర్చిన వారిని దేవునితో సమానంగా చూస్తారని అటువంటి వారిని జీవితకాలం మరిచిపోలేరన్నారు. అదే విధంగా గాంధేయ సిద్దాంతంలో కూడా తన కోసం కాకుండా పరులకోసం పాటుపడాలని గాంధీ మహాత్ముడు తెలిపారన్నారు. రాజ్యాంగ సృష్టికర్త అంబేడ్కర్ కూడా అదే దారిని అవలంభించారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రత్యేక హోదా, చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్, మద్యపానం నిషేధం కోరుతూ నెల రోజులు తాను శాంతియుతంగా దీక్షలు చేయాలని సంకల్పించి పోలీసు అధికారులు అనుమతి కోరానని దానికి వారు అనుమతి ఇవ్వకపోవడంతో నిరసన తెలియజేస్తూ ఈ దీక్షలను చేపట్టాను కాని ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ఈ ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. బాలల భవిష్యత్తే భావితరాల భవిష్యత్తు. ప్రజల రక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ అని అన్నారు. ఈ సమావేశంలో ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ‘బంగారు’ భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …