Breaking News

టిడ్కో గృహాల ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కోటేశ్వరరావు, రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి, ఏపీ టిడ్కో చైర్మన్ జే. ప్రసన్నకుమార్, డైరెక్టర్ నాగేశ్వరమ్మ జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా పోలీసు అధికారి పి.జాషువా, మచిలీపట్నం గుడివాడ శాసనసభ్యులు పేర్ని వెంకటరామయ్య, కొడాలి వెంకటేశ్వరరావులతో కలసి గుడివాడ మల్లాయపాలెం లోని టిడ్కో గృహాల ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు.
తొలుత వారు బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు. అక్కడ ప్రాక్లైనర్ , ట్రాక్టర్లు, రోలర్తో జరుగుతున్న మట్టి చదును పనులు వారు పరిశీలించారు. అనంతరం టిడ్కోగృహాల వెనకవైపు నిర్మిస్తున్న హెలిప్యాడును వారు పరిశీలించారు. హెలిప్యాడును పక్కాగా నిర్మించాలని వారు సంబంధిత అధికారులకు సూచించారు.
తదుపరి వారు టిడ్కో గృహాలను సందర్శించి రాష్ట్ర ముఖ్యమంత్రి గృహాలను ప్రారంభించాక లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలన్నారు. తదనంతరం వైయస్సార్ విగ్రహం, శిలాఫలకం ఆవిష్కరణ ఏర్పాట్లు సజావుగా చేయాలన్నారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట టిడ్కో సి ఈ కృష్ణారెడ్డి పివో చిన్నోడు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ఆర్డీవో పద్మావతి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *