Breaking News

దోమల నివారణకు సామాజిక చైతన్యం అవసరము..

-ప్రై డే డ్రై డే ని పకడ్భందిగా నిర్వహించాలి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రాణాంతకమైన మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ దోమల నివారణ పై పూర్తి అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు పిలుపునిచ్చారు.
స్థానిక కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ కీటక జనిత వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేది వరుకు నిర్వహించే మలేరియా నివారణ మాసోత్సవాలను పురష్కరించుకుని సోమవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ ఢల్లీి రావు అధ్యక్షతన అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ దోమల నివారణ కార్యక్రమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రానున్న నాలుగు నెలలపాటు వర్షాకాలం అయినందున జనావాసాల మధ్య నీటి నిల్వలు, నీటి మడుగులు ఏర్పడే అవకాశం ఉందని, ఉపయోగించని నీరు వారం రోజులు నిల్వ ఉన్నట్లైయితే ఆ ప్రాంతంలో లార్వా ఆవాసం ఏర్పాటు చేసుకుని దోమలు వృద్ది చేందే అవకాశం ఉంటుందన్నారు. ఉపయోగించని పాత్రలు, కొబ్బరి బొండాలు, చెక్కలు, ఉపయోగించని టైర్లలో నీరు నిల్వ ఉండడం వలన దోమలు వృద్ది చెందుతాయన్నారు. వాడిన పాత్రలను ఎప్పటికప్పుడు పోడిగా ఉంచాలన్నారు. మరుగుదొడ్లపై ఉన్నటివంటి గాలి గొట్టాలకు మెష్‌ కట్టడం ద్వారా దోమల లార్వాను నివారించాలన్నారు. యనాఫిలిస్‌ దోమ వలన మలేరియా, ఎయిడీస్‌ దోమ వలన డెంగ్యు చికిన్‌గున్యా, క్యూలెక్స్‌ దోమ వలన బోద వ్యాధి, మెదడువాపు వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. వీటిని నివారించే విధంగా ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రైడే డ్రైడే 14 రోజుల సైకిలింగ్‌లో భాగంగా 7వ రోజుకే లార్వాను చంపి క్యూబా మరియు అడల్స్‌ దశకు పోకుండా దోమలు వృద్ధి చెందకుండా ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలన్నారు. ప్రజలలోకి ఈ సమాచారం అందించి అర్థం చేసుకునే విధంగా చైతన్య పరచాలన్నారు. సుమారు 50 సంవత్సరాల క్రితం ఉన్నటి వంటి దోమబెడదకు ఇప్పటి పరిస్థితులలో దోమలు పెరగడంపై అధ్యయనం చేసి నివారణోపాయాలు ఆలోచించాలన్నారు. సామాజిక చైతన్యం రావాలని స్థానిక సంస్థలు, వైద్య ఆరోగ్య శాఖకు సహకరించి 2023లో మలేరియాను పూర్తిగా నివారించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
అనంతరం జిల్లా మలేరియా అధికారి, వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన ‘‘మలేరియా వ్యాధి నివారణ మనతో మొదలవుతుంది… మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను విడుదల చేశారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌కుమార్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, జిల్లా అధనపు వైద్య ఆరోగ్య శాఖాధికారిని డా. ఉషారాణి, జిల్లా మలేరియా ఆఫీసర్‌ డా. వి.మోతిబాబు, ఏయంవో డి. సూర్యకుమార్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి

-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *