విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూన్ 14 వ తేదీ ప్రపంచ రక్త దాతలు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యాధికారులతో కలిసి సోమవారం స్థానిక పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవ అవగాహన పోస్టర్ ను కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాల నిండిన ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు రక్తదానానికి ముందుకు రావాలని, ఒకరు రక్తదానం చేస్తే నలుగురికి సహకారం అందించిన వారు అవుతారన్నారు. జూన్ 14 వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3:30 వరకు బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ వద్ద, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంకు ఎంజీ రోడ్డు తనీష్ జ్యువెలరీ వద్ద, లయన్స్ బ్లడ్ బ్యాంక్ సూర్యారావుపేట వద్ద నిర్వహిస్తున్నట్టు వైద్యాధికారులు కలెక్టర్ ఢల్లీి రావుకు వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్. డిఆర్‌ఓ కె మోహన్ కుమార్ డిఎం అండ్ హెచ్ ఓ డా. సుహాసిని, డిఎల్‌ఏటి కంట్రోల్ ఆఫీసర్ జె. ఉషారాణి పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …