– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జవాబుదారీతనానికి సరికొత్త నిర్వచనం ‘జగనన్న సురక్ష’ అని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కార్యక్రమం రెండో రోజులో భాగంగా నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికార యంత్రాంగం, సచివాలయ సిబ్బందితో కలిసి మారుతీనగర్లో ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయాలను సేకరించారు. మహిళ సాధికారత, రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలను వివరించారు. అర్హత ఉండి ఏమైనా సంక్షేమ పథకం, ధృవీకరణ పత్రాలు అందలేదా..? ఆరా తీశారు. స్థానికుల అభిప్రాయాలను ఫోటోతో సహా వాలంటీర్ యాప్ లో నమోదు చేశారు. ప్రతి పేదవాడికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్రంలో 99 శాతానికి పైగా అర్హులందరికీ ఈ ప్రభుత్వం మేలు చేకూర్చిందని వెల్లడించారు. సాంకేతిక, మరే ఇతర కారణాలతో మిగిలిపోయిన ఒక్క శాతం మందిని కూడా జల్లెడ పట్టి మరీ గుర్తించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులకు పథకాలను వర్తింపజేయడమే కాకుండా కావలసిన సర్టిఫికెట్లను కూడా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుందని మల్లాది విష్ణు అన్నారు. కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, మ్యుటేషన్ లావాదేవీలు, ఆధార్ కు బ్యాంక్ లింకేజీ, రేషన్ కార్డు మొదలైన 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి రుసుము లేకుండా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా సూచించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ సృజనా, సీనియర్ మెడికల్ ఆఫీసర్ సీహెచ్ బాబూ శ్రీనివాసరావు, నాయకులు అంగిరేకుల నాగేశ్వరరావు, కోలా నాగాంజనేయులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహసారథులు పాల్గొన్నారు.