విద్యార్థులలో స్నజనాత్మక పెంపొందించడమే లక్ష్యం….


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులలో స్నజనాత్మక ఆలోచనలను పెంపొందించడానికి ఉషా రామా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ కళాశాల చేస్తున్న కృషి అభినందనీయం అని ఆర్సిఈ డిఆర్డిఓ శాస్త్రవేత్త డాక్టర్ పి అనిల్ కుమార్ అన్నారు, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు ఉషా రామ ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం చెన్నై స్సేస్ కిడ్జ్సి సహకారంతో స్థానిక విద్యార్థులచే రూపొందించబడిన ఉషా రామ బెలూన్ శాటిలైట్ ప్రయోగం విజయవంతం అయ్యింది, ఈ సందర్భంగా జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యఅతిథి డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో తుది రూపం ఇచ్చి బెలూన్ శాటిలైట్ను తయారుచేసి ప్రయోగించడం శుభ పరిణామం విద్యార్థులు చదువుతోపాటు వారి కొత్త ఆలోచనలు పదును పెట్టి సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలను ఆవిష్కరించాలని ఆకాంక్షించారు, సినీ నిర్మాతలగా ఎంతో బిజీ షెడ్యూల్ తో కూడా కళాశాల కార్యదర్శి సుంకర అనిల్ విద్యార్థులను తమ కళాశాలలో విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించడం హర్షనీయం అన్నారు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి గౌతంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు అంతరిక్షంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి నిర్వహించే ప్రయోగాలు యువతకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఉషారామ విద్యార్థులు 25 మంది విద్యార్థులతో సుంకర అక్షయ్ నేతృత్వంలో దీన్ని రూపొందించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చేరువ చేయటం అభినందనీయం అన్నారు, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు, ఉషా రామ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తమ కళాశాలలోని విద్యార్థుల భవిత కోసం సమాజ వికాసం కోసం చేపట్టే కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం తరఫున తమ వంతు సహకారం అందించినట్లు తెలిపారు, చదివే కాదు చదివే కాదు చదువుల మర్మం కూడా తెలియజేయడానికి కళాశాల యాజమాన్యం చేస్తున్న కృషితో భావితరాలకు మేలు జరుగుతుందన్నారు, జేఎన్టీయూ కాకినాడ డిఇ బి. బాలకృష్ణ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానంపై సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడానికి ఏపీలో పప్రదముగా ఉషా రామా ఇంజనీరింగ్ కళాశాల చేపట్టిన బెలూన్ శాటిలైట్ ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందన్నారు, దీనితో అంతరిక్షంలో జరిగే పరిణామాలతో వాతావరణంలో వచ్చే మార్పు ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ పకృతి వైపరీత్యాల నుంచి పంటలను కాపాడి రైతాంగానికి మేలు జరిగితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు, అంతరిక్ష ప్రయోగాలలో విద్యార్థులను తీర్చిదిద్దడానికి కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం అభినందనీయం సాంకేతిక సవల్ ను అధికమించి భావితరాలకు మంచి జీవితాన్ని అందించడానికి ఉషా రామా ఇంజనీరింగ్ కళాశాల మరిన్ని ప్రయోగాలతో సమాజాభివృద్ధికి నూతన ఆవిష్కరణలను అందించాలి అన్నారు, కాకినాడ జేఎన్టీయూలో పరిధిలోని ఉషా రామ ఇంజనీరింగ్ కళాశాలలో తొలి అంతరిక్ష ప్రయోగం జరగటం సంతోషంగా సంతోషంగా ఉంది అన్నారు, విద్యార్థుల దీన్ని స్ఫూర్తిగా తీసుకొని తమలో దాగివున్న ఆలోచనలతో పదును పెట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు, ప్రిన్సిపాల్ జివికేఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ తమ విద్యార్థులు భావి భారత సైన్సిస్టులుగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దటమే తమ లక్ష్యం అని అన్నారు, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసిన తమ విద్యార్థులను, కళాశాల ఉపాధ్యాయులను పేరుపేరునా అభినందించిన ఉషా రామ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ సుంకర రాంబ్రహ్మం అభినందించారు,

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *