ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అవసరమైన ప్రతి పాదనలను రూపొందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆక్రమణలకు సంబంధించి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అవసరమైన ప్రతి పాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం విజయవాడ పశ్చిమ, సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గాలు, నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్డు భవనాలు, జలవనరుల శాఖ, రెవెన్యూ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ భూముల క్రమబద్దీకరణపై జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నివాసం ఉంటున్న నివాసితులకు ప్రత్యామ్నాయంగా జగనన్న కాలనీలలో గృహాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, వెలంపల్లి శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవినేని అవినాష్‌లు ఆయా నియోజకవర్గ పరిధిలోని భూముల క్రమబద్దీకరణ, పలు సమస్యలను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించాలని కోరారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, సబ్‌కలెక్టర్‌ అదితి సింగ్‌, నార్త్‌ తహాశీల్థార్‌ మాధురి, భూసేకరణ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ దుర్గాప్రసాద్‌, ప్రోటోకాల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ దుర్గాప్రసాద్‌, సిటీప్లానర్‌ రామ్‌కుమార్‌లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *