వైయన్ఆర్ చారిటీస్ సేవ కార్యక్రమాలు అభినందనీయం:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయన్ఆర్ చారిటీస్ ద్వారా విజయవాడ నగరంలో ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతు యలమంచిలి జయప్రకాష్ ఆపన్నులను ఆదుకోవడం అభినందనీయమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జి దేవినేని అవినాష్ కొనియాడారు. మాకు కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సన్నిహితంగా ఉంటూ స్వర్గీయ దేవినేని నెహ్రూ స్ఫూర్తితో వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం చారిటీస్ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా మా కుటుంబం తో రాజకీయంగా వెన్నంటి నడుస్తున్న నిబద్ధత గల ఓ పేద వ్యక్తికి జీవనోపాధి నిమిత్తం ఆటో అందజేయడం మంచి విషయమని అవినాష్ అభిప్రాయపడ్డారు. సున్నపుబట్టీల సెంటర్ సమీపంలోని YNR చారిటీస్ కార్యాలయం వద్ద 12వ డివిజన్ కు చెందిన శేషుకి దాదాపు 3 లక్షల రూపాయల ఆటో ను జీవనోపాధి నిమిత్తం అందజేయడం జరిగింది.ముఖ్యఅతిథుగా వైసీపీ తూర్పు ఇన్ చార్జి దేవినేని అవినాష్ పాల్గొని ఆటో ను ప్రారంభించారు. అనంతరం తాళాలను అవినాష్ లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ… నెహ్రూ స్ఫూర్తితో యలమంచిలి జయప్రకాష్ వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఉపాధి నిమిత్తం పలువురికి తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు అందజేశారని గుర్తుచేశారు. ఓ వైపు సేవా కార్యక్రమాలతో పాటు 8వ డివిజన్ ఇన్ చార్జిగా పార్టీ అభివ్రద్ధికి కూడా ఎంతగానో క్రషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ యలమంచిలి జయప్రకాష్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఎన్టీఆర్ జిల్లా ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ చిమాటా సాంబశివరావు,12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్,4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా రవి,తూర్పు నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్, వైస్సార్సీపీ నాయకులు పొట్లూరి రవి,దనేకుల కాళేశ్వర రావు,ఝాన్సీ,కొల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *