ఆర్జీదారు ఆర్జీలు పునరావృతం కాకుండా పరిష్కరించండి..

-స్పందనలో 128 అర్జీలు నమోదు…
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో నమోదైన ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి మరోక సారి ఆర్జీదారుడు స్పందన కార్యక్రమానికి రానవసరం లేకుండా నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్‌ డిల్లీరావు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టరు డిల్లీరావు మాట్లాడుతూ ఆర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి తమ సమస్య పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి రావడం జరుగుతుందని వ్యయ ప్రయాసలకు ఓర్చి స్పందనకు వచ్చి తమ వినతులు సమర్పించుకుంటారని, ఆర్జీదారుడు మరోక సారి స్పందన కార్యక్రమానికి రాకుండా వారి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు ఆదేశించారు. ప్రతి ఆర్జీని అధికారులు వ్యక్తిగత సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపాలన్నారు. స్పందనలో వచ్చిన ఆర్జీ పరిష్కారానికి సంబంధిత మున్సిపల్‌ కమీషనర్లు, ఎంపిడివోలు, తహాశీల్థార్లతో వర్చువల్‌గా మాట్లాడి సమస్యను వారికి వివరించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్పందనలో రెవెన్యూ, పోలీస్‌ శాఖలకు చెందిన ఆర్జీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని ఆయా శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్పందన ఆర్జీల పరిష్కారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణిత కాల పరిమితిలోగా పరిష్కరించాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని కాలయాపన లేకుండా పరిష్కారం చూపాలన్నారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదని, నమోదు అవుతున్న వినతులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.నేటి స్పందనలో 128 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖలో 58, పోలీస్‌ 17, విద్య 13, యంఎయుడి 7, పంచాయతీరాజ్‌ 5, ఏపిఎస్‌పిడిసిఎల్‌ 4, హెల్త్‌ 4, వ్యవసాయ 3, డిఆర్‌డిఏ 2, దేవాదాయ శాఖ 2, బిసి వెల్ఫేర్‌ 2, సోషల్‌ వెల్ఫేర్‌ 2, హౌసింగ్‌ 2, ఆర్‌ డబ్ల్యుఎస్‌ 1, ఉపాధి కల్పన 1, సర్వే 1, సహకర శాఖ 1, ఆర్‌అండ్‌బి 1, డ్వామా 1, ఇరిగేషన్‌ 1 ఆయా శాఖలలో అర్జీలు నమోదయ్యాయన్నారు. జిల్లాలోని ఆర్‌డివోలు, డివిజనల్‌ అధికారులు, ఆయా మండలాల యంపిడీవోలు, తహశీల్థార్లు, మున్సిపల్‌ కమిషనర్లతో వర్చువల్‌గా జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడి పరిష్కారమయ్యే వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు.
స్పందనలో వచ్చిన ప్రధాన ఆర్జీలు :
ఏ కొండూరు మండలం మాదవరం గ్రామానికి చెందిన యం. మహేష్‌బాబు ఆర్జీ ఇస్తూ గ్రామంలో రాకపోకలు నిర్వహిస్తున్న డొంక దారి ఆక్రమణలకు గురి అయ్యిందని, ఆ గ్రామానికి ఇరువైపుల ఉన్న గ్రామాలకు వెళ్ళెందుకు దారి ఆక్రమణలను తొలగించి రైతులకు దారి కల్పించాలని కోరారు.
నగరంలోని మదురానగర్‌కు చెందిన నరమామిడి లక్ష్మి ఆర్జీ ఇస్తూ తనకు ఇంటి స్థలం గాని ఇల్లు లేదని గతంలో పలుమార్లు ధరఖాస్తు చేసుకున్నానని ఆర్జీ ఇచ్చారు. దీనిపై కలెక్టర్‌ డిల్లీరావు స్పందిస్తూ అర్హతను పరిశీలించి 90 రోజులలో ఇళ్ళ పట్టా పథకంలో మంజూరు చేయాలని విజయవాడ ఈస్ట్‌ తహాశీల్థార్‌ను ఆదేశించారు.రెడ్డిగూడెం మండలం రంగాపురం గ్రామానికి చెందిన నరసారెడ్డి ఆర్జీ ఇస్తూ పూర్వికుల నుండి సక్రమించిన స్థలంలో తన వాటకి సంబంధించి సరిహద్దులలో కొందరి వ్యక్తులు రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్నారని దీనిపై తగు న్యాయం చేయాలని కోరారు. స్పందన కార్యక్రమంలో డిఆర్‌డిఏ పీిడి కె.శ్రీనివాస్‌, ఐసిడిఎస్‌ పీడి జి. ఉమాదేవి, డియంహెచ్‌వో డా. యం సుహాసిని, జిల్లా సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ యం విజయభారతి, జిల్లా విద్య శాఖ అధికారిని సివి రేణుక, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి యం. రుక్మాంగదయ్య, హౌసింగ్‌ పిడి రజినీ కుమారి, పశుసంర్థక శాఖ జెడి కె. విద్యాసాగర్‌, జిల్లా ఉద్యాన శాఖ అధికారి బాలాజీ కుమార్‌, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ వి.కె. విజయశ్రీ, ఇరిగేషన్‌ ఎస్‌ఇ విష్ణుమోహన్‌రావు, ఎల్‌డియం కె. ప్రియాంక, డ్వామా పిడి జె. సునీత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *