విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జగనన్న సురక్ష కార్యక్రమం పేద ప్రజలకు రక్షగా నిలుస్తుందని రాష్ట్ర హోం మంత్రి విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి డా. తానేటి వనిత అన్నారు.
స్థానిక కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో శుక్రవారం రాష్ట్ర హోం, జిల్లా ఇన్చార్జ్ మంత్రి తానేటి వనిత అధ్యక్షతన తూర్పు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూరు శాతం సంక్షేమం అందుతుందన్నారు.ఈ కార్యక్రమం ద్వారా 11 రకాల సర్టిఫికేట్లను ఉచితంగా అందిస్తున్నామన్నారు. గతంలో ఏ సర్టిఫికేటు తీసుకోవాలన్న రోజుల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండేదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో తీసుకువచ్చిన వినూత్న సంస్కరణలతో నేరుగా ఇంటి వద్దే సేవలు అందుతున్నాయన్నారు. ప్రజల అవసరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తిం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 99 శాతం మంది అర్హులకు పథకాలు అందుతున్నాయని మిగిలిన ఒక శాతం అర్హులకు కూడా జగనన్న సురక్ష పథకం ద్వారా లబ్ది చేకూర్చాలనదే ప్రభుత్వ ద్యేయం అన్నారు. జిల్లా స్థాయి కమిటీలో ఇన్చార్జ్ మంత్రి, జిల్లాకు చెందిన మంత్రులు, జిల్లా కలెక్టర్ , శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ప్రతీ నియోజకవర్గంలో స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామని, పరిష్కారం కాని వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించడం జరుగుతుందన్నారు. స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్ నియోజవర్గంలో పరిధిలో నగరపాలక సంస్థ, రెవెన్యూ శాఖలకు చెందిన సమస్యలను ప్రస్తావించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలకు పరిష్కారం చూపి నిధులు అవసరమయ్యే పనులకు సంబంధించి అధికారులను అంచనాల నివేధికలను రూపొందించాలని ఆదేశించడం జరిగిందని మంత్రి అన్నారు. నియోజకవర్గానికి సంబంధించి టిడ్కో గృహాల మంజూరు, జగనన్న కాలనీ గృహ నిర్మాణాల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సుదీర్ఘ సమస్యలైన చాకలిచెరువు, కుమ్మరి చెరువు, రెల్లి చెరువు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలు. కృష్ణలంక రుద్రభూమి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారికి శాశ్వత పట్టాలకు అర్హత మేరకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 19వ డివిజనలో 2 కోట్ల రూపాయల నిధులతో షాదీఖానా నిర్మించడం జరుగుతుందని, వీటిలో కోటి రూపాయలు నగరపాలక సంస్థ నిధులు సమకూరుస్తుందన్నారు. కృష్ణలంకలో కాపు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు త్వరలో స్థల సేకరణ చేస్తామన్నారు. నగర ప్రజలకు సంబంధించి గత నాలుగు సంవత్సరాలలో 70 శాతం సమస్యలను పరిష్కరించామని, మిగిలిన 30 శాతం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రామలింగేశ్వర నగర్ నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు తీరం వెంబడి కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో మూడు దశల రిటైనింగ్ వాల్ నిర్మాణంలో ఇప్పటికే రెండు దశలలో నిర్మాణం పూర్తి చేశామని మూడవ దశలో ఉన్న నిర్మాణం తుది దశకు చేరకుందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణా నదికి పూర్తిస్థాయిలో వరద నీరు వచ్చినప్పటికి కరకట్ట ప్రాంత ప్రజలు ముంపు నుండి రక్షణ పొందుతారన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పేద ప్రజలకు రాజధాని నడిబొడ్డున జగనన్న లేఅవుట్లలో ఇళ్ళ స్థలాలు కేటాయించి గృహాలను నిర్మిస్తామని మంత్రి అన్నారు.
నియోజకవర్గ స్థాయి సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, నగరపాలకసంస్థ అదనపు కమీషనర్లు శ్యామల, సత్యవతి అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …