జిల్లాలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టులలో అంగన్‌వాడీ సహాయకురాల పోస్టు భర్తీ

-సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి టి. నాగమణి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ అర్భన్‌ పరిధిలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ సహాయకురాల పోస్టు భర్తీ చేయనున్నట్లు సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి టి. నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని విజయవాడ అర్బన్‌ పరిధిలో సింగ్‌నగర్‌` 9 (ఒసి/58 డివిజన్‌) కి సంబంధించి అంగన్‌ వాడి సహాయకురాల పోస్టులను రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. పోస్టులకు 1.07.2023 నాటికి 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణురాలై ఆదే ఊరికి చెందిన కోడలై వారు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు. ఎస్‌.సి, ఎస్‌.టి,మరియు బి.సి. అభ్యర్ధులు కుల దృవీకరణ పత్రము, నివాస దృవపత్రము, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డ్‌ను జతపరచవలెను.
పైన తెలుపబడిన అర్హతలు ప్రకారం అంగన్వాడి సహాయకురాళ్ళ పోస్టునకు సెట్‌ల జిరాక్స్‌ ( గెజెటెడ్‌ ఆఫీసర్‌ వారిచే అటేస్ట్‌ చేయించి) పాస్‌ పోర్ట్‌ సైజు ఫోటోస్‌ జతపరచి పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ధరఖాస్తులను ఆగస్టు 5వ తేది సాయంత్రం 5 గంటలలోపు అందజేయవలసి ఉంటుందన్నారు. ధరఖాసులను ఉమా శంకర్‌ నగర్‌ నందు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గల సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు విజయవాడ అర్భన్‌ వారి కార్యాలయము నందు ధరఖాస్తు లు వ్యక్తిగతంగా అందజేయవలెనని సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అధికారిణి టి. నాగమణి ఆ ప్రకటనలో తెలిపారు.
ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్‌ నంబరు 944081595

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *