నగరంలో వీధి కుక్కలను నియంత్రించే దిశగా చర్యలు

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
-నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన, నగరపాలక సంస్థ కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, గారి సమక్షంలో ఫ్లోర్ లీడర్  వెంకట సత్యనారాయణ  ఆధ్వర్యంలో గురువారం రాత్రి 7 గం.లకు కామండ్ కంట్రోల్ రూమ్ నందు కార్పొరేటర్స్ మరియు అధికారులతో కలిసి నగరంలోని వీధి కుక్కలను నియంత్రించే దిశగా సమీక్ష సమావేశం నిర్వహించారు. వీధి కుక్కల వలన ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో కుక్కల ప్రేమికులు మరియు జీవకారుణ్య సంఘం సభ్యులతో చర్చించడం జరిగింది. కమిషనర్ సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్‌లోని డాగ్ ఆపరేషన్ యూనిట్‌లో ఏర్పాటు చేసిన వీధి కుక్కల ఆపరేషన్ ప్రక్రియను సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

నగరంలో వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు, అలాగే నగర పరిధిలో రోజుకు సుమారు 100 కుక్కలను పట్టుకోవాలని, ఆపరేషన్ యూనిట్‌లో యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) ఆపరేషన్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మరియు కుక్క ప్రేమికులు ఈ అంశంలో VMCకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు మరియు పెంపుడు కుక్కల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పెంపుడు కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ARV)తో ఆపరేషన్ చేసి టీకాలు వేయించాలి.

యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ARV) ఆపరేషన్ చేసే రెండు వారాలు ముందుగా డివిజన్ల వారిగా యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) గురించి మైక్ ద్వారా ప్రజలకు అవగాహనా కల్పించాలన్నారు. కొన్ని కుక్కల ప్రేమికులు మరియు నివాస కాలనీ ప్రతినిధులతో వీధి కుక్కల నుండి సురక్షిత కొరకు సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. హోటల్లు, చేప మాంసం అమ్మేవారు వ్యర్ధాలను సక్రమంగా పారవేయాలని చెర్యలు తీసుకోనున్నారు. నగరంలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో మూడు సంచార వాహనం ద్వారా వీధి కుక్కలకు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ARV) చేయవలెనని కమిషనర్ గారు ఆదేశించినారు. రోజుకు 100 వీధి కుక్కలకు ఏ ఆర్ వి వ్యాక్సిన్ చేయవలెనని చెప్పారు మరియు ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న డాగ్ లవర్స్ కుక్కలపై అవగాహన సదస్సు పెట్టి ప్రజలను చైతన్య పరచవలనని ఆదేశించినారు కుక్కలను 2001 యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వారి నిబంధనలకు లోబడి చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగినది. వీధి కుక్కల సమస్యలకు 1800 425 2000 విఎంసి టోల్- ఫ్రీ నెంబర్ మరియు 8181960909 విఎంసి వాట్సప్ నెంబర్ ను సంప్రదించగలరు.

ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్లు వెంకట సత్యనారాయణ, నెలిబండ్ల బాలస్వామి, బోయి సత్యబాబు, కార్పొరేటర్స్ భీమిరెడ్డి శివ వెంకట జానారెడ్డి, శిరంశెట్టి పూర్ణచంద్ర రావు, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి), పుప్పాల నరస కుమారి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. పి.రత్నావళి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ మరియు కుక్కల ప్రేమికులు మరియు జీవకారుణ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *