-ఫేజ్ -2 రీ సర్వే లక్ష్యాల సాధనకు కృషి చెయ్యాలి
-ఎఫ్ పి షాప్స్, ఎమ్ డి యూ, పెట్రోల్ బంకులు, గ్యాస్ కంపెనీ తనిఖీ నిర్వహించాలి
-నీటి తిరువా బకాయిలు, డిమాండ్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి
-2023-24 ఖరీఫ్ ప్యాడి సేకరణ లక్ష్య సాధనకు నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చెయ్యండి
-జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటరు జాబితా మేరకు గుర్తింపు ప్రక్రియ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు.
శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ క్షేత్ర స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్ ఎస్ ఆర్, రీ సర్వే ఫేజ్ 2, భూ ఆక్రమణలు క్రమ బద్దికరణ, రెవెన్యూ స్పందన పై, జేకేసి, కమిటీ నివేదిక, స్వమి త్వా, సి సి ఆర్ కార్డ్స్, ఖరీఫ్ ప్రణాళిక, నీటి తిరువా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లాలో 592415 మంది గృహాల లోని 15,52,268 మంది ఓటర్లు గుర్తింపు ప్రక్రియ 1559 బి ఎల్ వో ల ద్వారా చేపట్టడం జరుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు 2,21,382 గృహాలను సందర్శించి 4,74,505 మంది ఓటర్ల ను బి ఎల్ వోలు గుర్తించడం జరిగిందన్నారు. సగటున ఒకొక్క బి ఎల్ వో కి 250 నుంచి 300 గృహాలు సందర్శించాల్సి ఉంటుందని, ఆమెరకు ఖచ్చితంగా ప్రతి ఇంటిని బి ఎల్ వో వెళ్లేలా పర్యవేక్షణ చేస్తూ, ఎప్పటి కప్పుడు ఆ డేటా అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. విశిష్ట ప్రతిభా వంతులు, థర్డ్ జెండర్ ఓటరు గుర్తింపు, యువ ఓటర్లు నమోదు చేయడం పై దృష్టి పెట్టాలన్నారు.
రీ సర్వే ఫెజ్ 2 కింద జిల్లాలో 20 గ్రామాలకు గాను 11 గ్రామాలు తహశీల్దార్ లాగిన్ లో, 5 గ్రామాలు ఫైనల్ ఆరో వో ఆర్ చెయ్యవలసి ఉందని అన్నారు. జేకేసి కి చెంది 108 అర్జీలు ఆడిట్ నిర్వహించడం జరిగిందన్నారు. 12 ఇంకా పరిశీలన చెయ్యవలసి ఉండగా, తగిన విధంగా చర్యలు తీసుకోను అర్జీలు 27 ఉన్నాయని, వాటిని పరిశీలించి తక్షణం క్లియర్ చెయ్యాలని ఆదేశించారు. జిల్లాలో 1,10,000 సి సి ఆర్ సి కార్డుల లక్ష్యం కాగా 89866 జారీ చేశారని, మిగిలిన 22 వేలు కూడా రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఓ టి ఎస్ కింద 1296 దరకస్తులు రాగ 700 లకు చెంది రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని, మిగిలిన వాటిని కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని తేజ్ భరత్ స్పష్టం చేశారు.
డివిజన్, మండల స్థాయి అధికారులు వారి పరిధిలోని చౌక ధరల దుకాణం, ఎమ్ డి యూ వాహనం, గ్యాస్ గోడౌన్, పెట్రోల్ బంకులను లక్ష్యాలు మేరకు తనిఖీ చెయ్యలన్నారు. ఖరీఫ్ 2023-24 కి చెంది ముందస్తు ప్రణాళిక, 239 ఆర్బికే లలో మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో నీటి తిరువా పన్నుల వసూళ్లు కు చెంది బకాయిలు రూ.17423603, ప్రస్తుత ఏడాది డిమాండ్ రూ. 2,23,15,868 వెరసి రూ. 3,97,39,471 కి గానూ రు.42,76,260 వసూళ్లు సాధించి నట్లు మిగిలిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News