ఘనంగా ఎమ్మెల్యే వెలంపల్లి పుట్టినరోజు వేడుకలు


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పశ్చిమ నియోజక వర్గంలో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా  నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వలంటీర్లపై ఇష్టానుసారం మాట్లాడుతుండటం దారుణం అన్నారు. కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలు అందిం చారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవుపలికారు. పాలనను ప్రతి గడపకూ తీసుకెళ్లడంలో సీఎం జగన్ విజయం సాధించారని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నాశనం చేసారన్నారు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థలన్నింటికీ జీవం పోశారని చెప్పారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారని ఆయన దుయ్యబట్టారు. ఎవరెం తగా దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని, తిరిగి వైఎస్ జగన్ కే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు చీరల పంపిణీ చేసారు. పలు ప్రాంతాల్లో జరిగిన వెలంపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, నాయకులు బంక విజయ, బంక శివ, బంక చాముండేశ్వరి, కార్పొరేటర్లు  చైతన్య రెడ్డి, బండి పుణ్యశీల,  చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండపల్లి బుజ్జి, దుర్గమ్మ ఆలయ ఛైర్మన్ కర్నాటి రాంబాబు పలువురు పార్టీ నేతలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *