-జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటానికి ప్రథమ బహుమతి
మచిలీపట్నం,నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనలో జిల్లా నీటి యాజమాన్య సంస్థకు ప్రథమ బహుమతి లభించింది.77వ స్వాతంత్ర్య దినోత్సవమును పురస్కరించుకుని మంగళవారం స్థానిక పోలీసు కవాతు మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక యువజన అభ్యుదయ శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆర్కే రోజా, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, జిల్లా ఎస్పీ పి.జాషువాలతో కలసి ప్రదర్శనను తిలకించారు.జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ – వైయస్సార్ క్రాంతి పథం, జిల్లా వ్యవసాయ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా), జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్ష, డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలు తమ పథకాలకు సంబంధించిన వివరాలతో శకటాలను ప్రదర్శించాయి.