స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అలరించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు !!

-ప్రధమ బహుమతి మచిలీపట్నం నిర్మలా హై స్కూల్ కు లభించింది.
-ద్వితీయ బహుమతి గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్ కు లభించింది .
-తృతీయ బహుమతి మల్లవోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు లభించింది

మచిలీపట్నం,నేటి పత్రిక ప్రజావార్త :
77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు.కృష్ణాజిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు దేశభక్తిని ప్రేరేపించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలు వేషధారణలు పలువురును ఆకట్టుకున్నాయి. ప్రతి ఏడాది ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థినీ విద్యార్థులు చేసే సాంస్కృతిక నృత్యాలకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు.తొలుత లేడీ యాంప్తిల్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 75 మంది బాలికలు ” భారతమాతకు వందనం.. నా జన్మభూమి కి వందనం విశ్వమంతా వెలుగు నింపే వేద భూమికి వందనం ” అంటూ చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. తర్వాత గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ” ఈ దేశం నా ప్రాణమని… ఈ దేశం నా సర్వమని.. ఈ దేశంలో జన్మించడం ఎంతో పుణ్యమని ” అంటూ చేసిన నృత్యం పలువురిని ఆకట్టుకుంది. ఆ తరువాత మోపిదేవి జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు” ఏ వతన్ మీరే వతన్ అంటూ దేశభక్తి గల హిందీ పాటకు అనుగుణంగా నృత్యం చేశారు. ఆ తర్వాత మచిలీపట్నం లోని ఐదు మున్సిపాలిటీ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ” వినరా వినరా దేశం మనదేరా.. అనరా అనరా రేపు ఇక మనదేరా ” దేశభక్తిని పెంపొందించే గేయానికి అనుగుణంగా నృత్యాన్ని చేయడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులను చేశారు. అనంతరం మల్లవోలు జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు భారతరత్న దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆలపించిన ” వందేమాతరం.. సుజలాం సుఫలం. సుజలం సుఫలం మలయజ శీతలమ్శస్యశ్యామలం మాతరం,వందే సుజలం సుఫలం మలయజ శీతలమ్ శస్య శ్యామలం మాతరం ” అంటూ దేశభక్తిని ప్రబోధించే విధంగా విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృత నృత్యం పలువురిని ఆకట్టుకుంది. చివరిగా మచిలీపట్నంలోని నిర్మల హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ” తేరీ మిట్టీ మే మిల్ జవాన్.. గుల్ బాన్ కే మే ఖిల్ జవాన్ ” వీర సైనికుని త్యాగాన్ని గుర్తుచేస్తూ చేసిన నృత్యం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *