-దివంగత రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఆర్. శంకరన్ కు నివాళులర్పించిన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, లెనిన్ సెంటర్ సమీపంలోని అంబేద్కర్ భవన్‌లో దివంగత రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఆర్. శంకరన్ వర్ధంతి సందర్భంగా సబ్ కలెక్టర్ అదితి సింగ్ ఐ.ఏ.ఎస్ తో కలిసి వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించారు.ఎస్ ఆర్ శంకరన్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన వెనకబడిన వర్గాలకు చేసిన యనలేని కృషిని గుర్తు చేసుకుని ఆయన ఆశయాలనే స్పూర్తిగా తీసుకుని సమాజభివృద్ధి చేయాలనీ, ప్రజా సేవలో తనకంటూ చెరగని ముద్రను వేసుకున్నారని, జీవితమంతా ప్రజలకు నిబద్ధులై ఉండే అరుదైన అధికారుల్లో ఎస్.ఆర్ శంకరం ఒకరని తన జీవితమంతా అట్టడుగు వర్గాల, దళితుల అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేశారు అని కమిషనర్ అన్నారు.