Breaking News

బాలికల విద్యాభివృద్ధికి కృషి చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో ఆంధ్రా లయోలా కాలేజీ ‘ఎస్-జె ఎక్స్ లెన్స్ హాల్’లో సోమవారం కేజీబీవీల్లో కొత్తగా నియామకం పొంది విధుల్లో చేరిన సీఆర్టీలు, పీజీటీలు, పీఈటీలకు శిక్షణ ఇచ్చేందుకు 108 మంది స్టేట్ రిసోర్సు పర్సన్లకు 4 రోజుల పాటు శిక్షణా TOT (Training of Trainers) కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కేజీబీవీ సెక్రటరీ డి.మధుసూదనరావు మాట్లాడుతూ.. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు ( కేజీబీవీల్లో) చదువుతున్న బాలికలకు నాణ్యమైన విద్య అందించి, బాలికాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణా కార్యక్రమానికి ‘ఇగ్నస్ ఫెహల్’ బృందం భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇగ్నాస్ ఫెహల్’ ఎడ్యుకేషన్ సంస్థ వ్యవస్థాపకులు సుబీర్, కేజీబీవీ జాయింట్ సెక్రటరీ ఎన్.గీత, ఎస్సీఈఆర్టీ, సమగ్రశిక్ష సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్టేట్ రిసోర్సు పర్సన్లకు ఇచ్చిన మాడ్యూళ్ల ద్వారా జిల్లాల్లోని కేజీబీవీల టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *