పరీక్షల నిర్వహణ పై సమన్వయ కమిటీ అధికారుల సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపిపీఏస్సి గ్రామ/వార్డు సెక్రటేరియట్ ఫంక్షనరీల కేటగిరీ లోని పి ఆర్ మరియు ఆర్ డి డిపార్ట్‌మెంట్‌లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5, గ్రామ రెవెన్యూ అధికారి గ్రేడ్-II, విఆర్వో గ్రేడ్-I & రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లు మరియు కారుణ్య కారణాలపై నియమితులైన ఉద్యోగులకు నవంబర్ 14 న మూడు షిఫ్ట్ లలో కంప్యూటర్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం జరుగుతోందని. జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు.

సోమవారం ఉదయం కలెక్టరేట్ డి ఆర్వో ఛాంబర్ లో పరీక్షల నిర్వహణ పై సమన్వయ కమిటీ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేషన్ ఆఫీసర్‌, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు మాట్లాడుతూ, రాజమహేంద్రవరంలోని జి ఎస్ ఆర్ ఆన్‌లైన్ అకాడమీ, కాతేరు, రాజమహేంద్రవరంలో పరీక్షలను సజావుగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించడం కోసం అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చెయ్యడం జరిగిందన్నారు. మంగళవారం రోజు రెండు షిఫ్ట్ లలో ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉ.12.00 మధ్యాహ్నం 12.30 వరకు జరిగే పరీక్షలకి 110 మంది , మ.2.30 PM నుండి 3.00 వరకు జరిగే పరీక్ష లకున్115 మంది హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కు గంట ముందు అభ్యర్థులను అనుమతించడం జరుగుతుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించడం జరుగదు, హల్ టికెట్ తో ఫోటో గుర్తింపు కార్డు తప్పని సరి అని పేర్కొన్నారు ఈ పరీక్షల లైజన్ ఆఫీసర్‌గా ఎం. నాగలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్(CS), తహశీల్దార్ కార్యాలయం, రాజమహేంద్రవరం అర్బన్ వారిని నియమించడం జరిగిందన్నారు.

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం పోలీసు సూపరింటెండెంట్ పరీక్షా కేంద్రం వద్ద శాంతి భద్రతలను సక్రమంగా నిర్వహించడం కోసం పరీక్ష రోజున కనీసం 3 మంది పోలీసు సిబ్బందిని (2 పురుషులు & 1 స్త్రీ) బందోబస్తు/ భద్రతను అందించాలన్నారు. తహశీల్దార్, రాజమహేంద్రవరం రూరల్, తూర్పుగోదావరి జిల్లా పరీక్ష నిర్వహించే సమయంలో పరీక్షా కేంద్రంలో 144 సెక్షన్‌ని అమలు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసర మైనప్పుడు వైద్య సహాయం అందించడానికి పరీక్షా కేంద్రంలో మెడికల్ కిట్ మరియు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎపి ఎస్పిడిసిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్, తూర్పు గోదావరి, రాజమహేంద్రవరం పరీక్షా కేంద్రాల వద్ద పరీక్ష సమయాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం మరియు పరీక్షను సజావుగా నిర్వహించడం కోసం తగిన ఏర్పాట్లు చెయ్యలన్నారు.

ఈ సమావేశం లో ఎపిపి ఎస్సీ అధికారులు ఎన్. అనియమ్మ, ఎమ్. మాధవీలత, పోలీసు శాఖ ఎస్బి డిఎస్పీ డి. వామ వర్మ, విద్యుత్ శాఖ డి ఈ ఎస్. దేవయ్య, తహశీల్దార్ఎమ్. నాగలక్ష్మి, , రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *