విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
బాలలదినోత్సవం… పుస్తక వారోత్సవాల సందర్భంగా విశాఖపట్టణం గాజువాక లోని సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పలు రకాల అంశాలపై ఎంతో కోలాహాలంగా చిన్నారుల మధ్య ఆసక్తికర పోటీలు జరిగాయి. శాస్త్రీయ నృత్య పోటీలో ఐదో తరగతికి చెందిన… సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మనమరాలు వేదుల కృత్తిక, అదే తరగతి చెందిన యోక్షిత్ లు వరుసగా ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి భారతి విజేతలకు మెడల్స్ అందించారు. చైర్మన్ వాస శ్రీనివాసరావు, డైరెక్టర్ వాస మాధవి విజేతలను అభినందించారు.
Prajavartha Online Telugu News