Breaking News

ఆరోగ్యశ్రీతో ప్రజలందరికీ ఆరోగ్య భద్రత… : ఎమ్మెల్యే కొడాలి నాని

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ టిడ్కో ఫ్లాట్ల వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కృపా అనే యువతికి మెరుగైన వైద్యం అందించేలా సహకరించాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కొడాలి నానికు విజ్ఞప్తి చేశారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే నాని హాస్పిటల్ సూపరిండెంటెంట్ ఇందిరా దేవికి ఫోన్ చేసి గాయపడిన యువతికు అందిస్తున్న చికిత్సల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమనుకుంటే మెరుగైన వైద్య చికిత్సల నిమిత్తం ఉన్నత హాస్పిటల్స్ కు రిఫర్ చేయాలని సూపరిండెంటెంట్ కు ఎమ్మెల్యే నాని సూచించారు. ఆరోగ్యశ్రీ 25 లక్షలకు పెంచిన దృష్ట్యా వైద్య చికిత్సలు విషయమై ఆందోళన చెందనవసరం లేదని బాధ్యత కుటుంబానికి ఎమ్మెల్యే నాని ధైర్యం చెప్పారు. అవగాహన లేమితో కొన్నిచోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలను విజయవంతంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. అనంతరం పలు ప్రజా సమస్యలపై పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, బీసీ సెల్ నాయకులు చుండూరి శేఖర్, పుల్లేటికుర్తి కృష్ణ ఎమ్మెల్యే నానిను కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *