తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
పట్టణానికి చెందిన దర్శకుడు కనపర్తి రత్నాకర్ తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు ను అందుకున్నారు. నేస్తం ఫౌండేషన్, తెలుగు సినిమా వేదిక సంయుక్త అధ్వర్యంలో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మంగళవారం రాత్రి తెలుగు సినిమా పుట్టిన రోజు వేడుకలు ఘనంగా గా జరిగాయి. ఈ సందర్భంగా సినీ రంగం లో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి తెలుగు సినిమా లెజెండరీ మెమోరియల్ అవార్డు లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అగ్ర నిర్మాత, భారతీయుడు, జెంటిల్మెన్ తదితర చిత్రాలను నిర్మించిన ఏఎం రత్నం పాల్గొన్నారు. రత్నాకర్ కు ఏ.ఎం రత్నం చేతులు మీదుగా అవార్డు ను అందించారు. నిర్వాహకులు జే.వి. మోహన గౌడ, పి. విజయేంద్ర వర్మ రత్నాకర్ ను సత్కరించారు. అతిథులుగా హాస్యనటులు బాబు మోహన్, చిట్టిబాబు, సీనియర్ కథానాయకి కవిత, నటి శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భముగా బుధవారం రత్నాకర్ ను పట్టణ ప్రముఖులు, కళాకారులు అభినందించారు.
Prajavartha Online Telugu News