-ఎమ్మెల్యే నాని సమక్షంలో వైసీపీలో చేరిన…. పశుభోట్ల వానిపాలెం గ్రామ టిడిపి నాయకులు…గౌడ యువత
-జగన్‌కు ఓటేస్తే ఈ మంచి అంతా కొనసాగుతుంది.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపు పలుకుతారు
నందివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నందివాడ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో గుడ్లవల్లేరు మండలం పశుబోట్ల వానిపాలెం గ్రామానికి చెందిన 50 మంది టిడిపి కార్యకర్తలు…. గౌడ యువత ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసిపిలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులకు పార్టీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే కొడాలి నాని వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ… చంద్రబాబుది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే నైజమని, అందుకే మోడీని తిట్టిన నోటితోనే ఇప్పుడు జైకొడుతున్నాడని అన్నారు. జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటూ 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రచారం చేశాడని ఆయన వ్యాఖ్యానించారు.ఇప్పుడు అదే బీజేపీ పంచన చంద్రబాబు చేరాడని, దీనికి కారణం కేసుల భయమేనని అన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయన్నారు. ప్రజలు అదే విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారని కొడాలి నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వ్యక్తులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై స్వచ్ఛందంగా పార్టీలో చేరమన్నారు. ఈ కార్యక్రమంలో
ఎంపీపీ పేయ్యల ఆదాం, జడ్పిటిసి కందుల దుర్గాకుమారి పాల్గొన్నారు. పశుభట్లపాలెం గ్రామానికి చెందిన కాగిత శశిధర్,కాగిత గణేష్,కాగిత పవన్ కుమార్,చిట్టి బొమ్మ సురేంద్ర,వీరంకి అజయ్,షేక్ బాషా,వీరంకి నిరంజన్,అనగానే నాని,చిట్టి బొమ్మ నారాయణ పలువురు గౌడ యువత ఎమ్మెల్యే నాని సమక్షంలో పార్టీలో చేరిన వారిలో ఉన్నారు .
Prajavartha Online Telugu News