Breaking News

గడప గడపకి ఎన్నికల ప్రచారంలో దిమంత్ సాయి

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం నియోజకవర్గం మైలవరం పట్టణంలో వసంత వెంకట కృష్ణప్రసాద్ (ఉమ్మడి కూటమి అభ్యర్థి) తనయుడు దిమంత్ సాయి గడప గడపకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుధవారం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ణప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు. అందరిని అప్యాయంగా పలకరిస్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు మహిళా నేతలు తెలుగుదేశం, జనసేన బిజెపి పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *